- Telugu News Photo Gallery Viral photos Know meaning of colours on milestone which tell about route and other details read here full knowledge
దూరాన్ని తెలిపే రాళ్లపై పసుపు, కొన్నిసార్లు ఆకుపచ్చ రంగు కనిపిస్తుంది.. వీటి అర్థం ఏంటో తెలుసా..?
Milestone Colours: మీరు ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళినప్పుడు రహదారి పక్కన దూరాన్ని సూచించే రాయి కనబడుతుంది. దానిపై ఆ మార్గంలో ఉండే గ్రామాలు, పట్టణాల దూరం రాసి ఉంటుంది.
Updated on: Jan 15, 2022 | 1:50 PM

మీరు ఒక నగరం నుంచి మరొక నగరానికి వెళ్ళినప్పుడు రహదారి పక్కన దూరాన్ని సూచించే రాయి కనబడుతుంది. దానిపై ఆ మార్గంలో ఉండే గ్రామాలు, పట్టణాల దూరం రాసి ఉంటుంది. కానీ ఈ రాళ్లపై ఉండే ప్రత్యేకమైన రంగులను ఎప్పుడైనా గమనించారా. ఇందులో ఒక్కో రంగుకు ఒక్కో అర్థం ఉంటుంది. దాని గురంచి తెలుసుకుందాం.

నారింజ రంగు: రోడ్డు పక్కన ఉన్న మైలురాళ్లపై నారింజ రంగు చారలు ఉండటం మనం చాలాసార్లు చూసే ఉంటాం. ఈ చారలు మీరు గ్రామీణ రహదారిపై ప్రయాణిస్తున్నారని తెలుపుతుంది. భారతదేశంలో గ్రామీణ రహదారుల నెట్‌వర్క్ దాదాపు 3.93 లక్షల కి.మీ.

పసుపు చారలు: పసుపు గీతలు అంటే మీరు జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నారని అర్థం. ఇటీవల విడుదలైన డేటా ప్రకారం భారతదేశంలో జాతీయ రహదారి 1 లక్షా 51 వేల 19 కి.మీ.

నీలం లేదా నలుపు చారలు: మీరు రోడ్‌సైడ్ మైలురాళ్లపై నీలం లేదా నలుపు లేదా తెలుపు చారలు కనిపిస్తే మీరు పట్టణ లేదా జిల్లా రహదారిపై ప్రయాణిస్తున్నారని అర్థం. భారతదేశంలో ఇటువంటి రోడ్ల నెట్‌వర్క్ 5 లక్షల 61 వేల 940 కి.మీ.

గ్రీన్ బెల్ట్‌లు: రాష్ట్ర రహదారి వెంట ఉన్న మైలురాళ్లపై ఆకుపచ్చ గీతలు ఉంటాయి. ఈ రహదారులు రాష్ట్రంలోని వివిధ నగరాలను ఒకదానితో ఒకటి కలుపుతాయి. 2016 డేటా ప్రకారం భారతదేశంలో స్టేట్ హైవే నెట్‌వర్క్ 1 లక్ష 76 వేల 166 కి.మీ.లో విస్తరించి ఉంది.



