AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Type 2 Diabetes: ఈ ఒక్క పండు చాలు మధుమేహం నుంచి మిమ్మల్ని కాపాడడానికి.. ముఖ్యంగా టైప్ 2 షుగర్ పేషెంట్స్ కు దివ్య ఔషధం

Blueberries: భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే డయాబెటిస్ (Diabetes) వ్యాధితో బాధపడుతున్నవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఒక్కసారి మధుమేహం బారిన పడితే.. తగ్గడం అన్నమాట లేదు..

Type 2 Diabetes:  ఈ ఒక్క పండు చాలు మధుమేహం నుంచి మిమ్మల్ని కాపాడడానికి.. ముఖ్యంగా టైప్ 2 షుగర్ పేషెంట్స్ కు దివ్య ఔషధం
Blueberries For Type 2 Diabetes
Surya Kala
|

Updated on: Jan 16, 2022 | 11:20 AM

Share

Blueberries: భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే డయాబెటిస్ (Diabetes) వ్యాధితో బాధపడుతున్నవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఒక్కసారి మధుమేహం బారిన పడితే.. తగ్గడం అన్నమాట లేదు.. నివారణ చర్యలను పాటిస్తూ.. అదుపులో ఉంచుకోవాల్సిందే. అందుకనే మధుమేహాన్ని అదుపు చేసేందుకు జీవనశైలి, ఆహారంలో అవసరమైన అనేక మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాయామం, ఆహారం, షుగర్ లెస్ ఫుడ్ తో పాటు తగిన మేడిసిన్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అదే సమయంలో ఆహారంలో ఈ పండ్లను చేర్చుకోవడం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. అదే బ్లూబెర్రీ (Blueberries). అవును బ్లూబెర్రీ ఫ్రూట్ మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

టైప్ 2 డయాబెటిస్ :

మధుమేహాన్ని ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ తగ్గించడంలో బ్లూబెర్రీస్‌ ముఖ్య పాత్రను పోషిస్తాయి. వీటిల్లోని పోషకాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఒక అధ్యయనం ప్రకారం, బ్లూబెర్రీస్ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని తెలిసింది.

వాస్తవానికి బ్లూబెర్రీస్ ఏ రకమైన డయాబెటిస్‌కైనా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ పండ్లను మాత్రమే కాకుండా బ్లూబెర్రీస్ ఆకులను కూడా మధుమేహాన్ని నివారిస్తాయి. ఆకులతో కషాయాన్ని తయారు చేస్తారు. ఈ కాషాయం షుగర్ పేషెంట్స్ కు మంచి ఔషధంగా పనిచేస్తుంది. అయితే ఈ కషాయాన్ని సరైన మోతాదులో తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

బ్లూబెర్రీ ఆకులు , బెర్రీలలో రకరకాల విటమిన్లు , పోషకాలు, లవణాలను కలిగి ఉంటాయి. టైప్ 1 , టైప్ 2 డయాబెటిస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఇవి సమర్ధవంతంగా పనిచేస్తాయి.

బ్లూబెర్రీ మధుమేహాన్ని నియంత్రించే విధానం:

బ్లూబెర్రీస్‌లో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి, యాంటీ క్యాన్సర్ లక్షణాలతో సహా ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జర్నల్ ఆఫ్ న్యూట్రియంట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, బ్లూబెర్రీస్ తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించడంతో సహాయపడతాయి . అంతేకాదు యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్ల నుండి ఉపశమనం లభిస్తుంది.

బ్లూ బెర్రీస్ షుగర్ వ్యాధికి మాత్రమే కాదు జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది. మెదడు చురుగ్గా ఉండటంలో సహకరిస్తాయి. రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. బ్లూ బెర్రీస్‌,వృద్ధుల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి దోహదం చేస్తాయని శాస్త్రజ్ఞులు సూచిస్తున్నారు.

Also Read:  వంటగది నిర్మాణం కోసం సింపుల్ టిప్స్.. పొయ్యి, కుళాయి ఏ దిశలో ఉండాలంటే..