Vastu Tips: వంటగది నిర్మాణం కోసం సింపుల్ టిప్స్.. పొయ్యి, కుళాయి ఏ దిశలో ఉండాలంటే..

Vastu Tips: వాస్తు శాస్త్రం (Vastu Sastra(లో..  ఇంటికి సంబంధించి ఇటువంటి అనేక నియమాలు ఉన్నాయి. అయితే ఈ నియమాలు అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. వాస్తు దోషం ఉన్న..

Vastu Tips: వంటగది నిర్మాణం కోసం సింపుల్ టిప్స్.. పొయ్యి, కుళాయి ఏ దిశలో ఉండాలంటే..
Vastu Tips
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 16, 2022 | 2:06 PM

Vastu Tips: వాస్తు శాస్త్రం (Vastu Sastra(లో..  ఇంటికి సంబంధించి ఇటువంటి అనేక నియమాలు ఉన్నాయి. అయితే ఈ నియమాలు అనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. వాస్తు దోషం ఉన్న చోట ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. మనిషిపై అధిక ప్రభావం చూపుతుంది. ఆర్థిక సమస్యలే కాకుండా శారీరక ఇబ్బందులు కూడా ఏర్పడతాయని.. నమ్ముతారు . వాస్తు ప్రకారం ఇంటిలోని గదులు (Rooms) ఏ దిక్కున ఉండాలి.. పూజ గది, బెడ్ రూమ్, కిచెన్ ఇలా ఏది ఎక్కడ ఉండాలనే విషయం వాస్తు శాస్త్రం చెబుతుంది. ఇక వంట ఇంటికి కూడా అనేక నిబంధనలు పెట్టారు. ఒకొక్కసారి వంటగదిని రెడి చేస్తున్న సమయంలో పొరపాటు చేసి ఉంటే.. చిన్న చిన్న చిట్కాలతో మీ వంటగదిలోని వాస్తు దోషాన్ని తొలగించుకోవచ్చు. వంటగదికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను తెలుసుకుందాం.

వంటగదిని నిర్మించుకునే దిశ:  ఇంట్లో వంటగది ఎప్పుడూ ఈశాన్య దిశలో ఉండకూడదు. అలా ఈశాన్యం లో వంట గది ఉండడం అశుభంగా పరిగణించబడుతుంది. అంతే కాదు వంటగదిలోని ఈ లోపం ఇంట్లోని సభ్యుల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. కనుక కొత్తగా ఇంటిని నిర్మించుకునేవారు వంటగది ఆగ్నేయ దిశలో మాత్రమే ఉండేలా చూసుకోవాలని వస్గుతు శాస్ర్తుంత్చురం సూచిస్తుంది. ఒక వేళ ఈ దిశ సాధ్యం కాకపోతే.. అప్పుడు వంటగదిని వాయువ్య దిశలో నిర్మించుకోవచ్చు.

 నైరుతిలో వంటగది:  ఇంట్లో వంటగది నైరుతి దిశలో ఉంటే…  కుటుంబ సభ్యుల ఆర్పైధికాభివృద్ధి పై చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతారు. ఈ వాస్తు దోషం వల్ల ఇంట్లోని సభ్యులపై కూడా నమ్మకం ఏర్పడదు. బేధాభిప్రాయాలు వస్తాయని అంటున్నారు.

పొయ్యి ఏ దిశలో ఉండాలంటే.. వంటగదిలో పొయ్యి ని ఎప్పుడు ఉత్తరం లేదా తూర్పులో పెట్టుకోవాలి. ఇలా చేయడం వలన శారీరక స్థితి కూడా మెరుగ్గా ఉంటుంది . ఇంట్లో పురోగతికి అవకాశాలు ఏర్పడతాయి. వంటగదిలో అల్మారాలను పశ్చిమ లేదా దక్షిణ దిశలో ఏర్పరచుకోవాలి.

కుళాయికి సంబంధించిన వాస్తు దోషం కుళాయిని వంట ఇంట్లో ఏ దిశలో ఏర్పాటు చేసుకోవాలంటే.. ఈశాన్య దిశలో ఉండాలి. కుళాయి ఈ దిశ లేకపోతే.. అది తప్పని సరిగా వంటగదికి సంబంధించిన ప్రధాన వాస్తు దోషమని.. దీని ప్రభావం అనేక విషయలపై ఉంటుందని నమ్మకం.

గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కేవలం ప్రజల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ప్రచురితమైంది. దీనితో టీవీ9, టీవీ 9 డిజిటల్‌కు ఎలాంటి సంబంధం లేదు.

Also Read: Viral Video: జలపాతం దగ్గర లవ్‌ ప్రపోజల్‌.. ఊహించని ట్విస్ట్‌.. విషాదానికి ఒక్క అడుగు దూరంలో ..