Prabhala Theertham: కోనసీమలో వైభవంగా జరుగుతున్న ప్రభల తీర్ధం.. జగ్గన్న తోటకు విచ్చేస్తున్న ప్రభలు..

Konaseema Kanuma Prabhala Theertham:ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండగ సంక్రాంతి (Pongal).. ఈ పండగ అన్ని ప్రాంతాల్లో ఓ ఎత్తైతే.. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కోనసీమ (Konaseema)కు..

Prabhala Theertham: కోనసీమలో వైభవంగా జరుగుతున్న ప్రభల తీర్ధం.. జగ్గన్న తోటకు విచ్చేస్తున్న ప్రభలు..
Kanuma Konaseema Prabhala Theertham
Follow us
Surya Kala

|

Updated on: Jan 16, 2022 | 2:33 PM

Konaseema Kanuma Prabhala Theertham:ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పండగ సంక్రాంతి (Pongal).. ఈ పండగ అన్ని ప్రాంతాల్లో ఓ ఎత్తైతే.. ఎటు చూసినా పచ్చదనం పరుచుకున్న కోనసీమ (Konaseema)కు సంక్రాంతి తెచ్చే సందడే వేరు. అవును సంక్రాంతికి వేదసీమ కోనసీమ పచ్చని పట్టుపరికిణీ కట్టుకున్న అందాల సుందరిలా ముస్తాబవుతుంది. ఇంటింటాసంబరాలు అంబరాన్ని తాకుతాయి. అక్షరానికందని అదొక వర్ణనాతీత అనుభూతి.

సంక్రాంతి వేడుకల్లో కోనసీమకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. అందులో ప్రభల తీర్థం ఒకటి. కోనసీమలో సంక్రాంతి నాడు కొన్ని చోట్ల, కనుమ నాడు మరికొన్ని చోట్ల ఈ తీర్థాలు నిర్వహిస్తారు. వీటన్నింటిలోనూ ప్రఖ్యాతి పొందింది జగ్గన్నతోటలో జరిగే ప్రభల తీర్థం.

సంక్రాంతి పండగలో మూడో రోజుని కనుమగా జరుపుకుంటారు. ఈ కనుమ పండగ రోజున వేదసీమలో ప్రభల తీర్ధం అత్యంత ఘనంగా జరుగుతుంది. ఇక్కడ తరతరాల నుంచి జరుగుతున్న ‘జగ్గన్నతోట’ ప్రభల తీర్థం వైభవాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే..

మకర సంక్రమణ ఉత్తరాయణ మహా పుణ్య కాలం లో కనుమనాడు జగ్గన్నతోటలో ఏకాదశ రుద్రుల సమాగమము జరిగుతుందని పెద్దల నమ్మకం. అమలాపురానికి దగ్గరలోని మొసలపల్లి-ఇరుసుమండ గ్రామాల మధ్య గల ఏడెకరాలను జగ్గన్నతోటగా పిలుస్టారు.

పురాణాల్లోని ‘ఏకాదశ రుద్రుల’కు ప్రతీకలైనవారు కోనసీమలోని ఇరుగుపొరుగు గ్రామాల్లో కొలువై ఉన్నారంటారు. మొసలపల్లి గ్రామదైవం భోగేశ్వరస్వామి ఆహ్వానం మేరకు వీరందరూ సంవత్సరానికి ఒకసారి సమావేశమై లోక కల్యాణం కోసం చర్చలు సాగిస్తారట. అలా 11మంది ఒకచోట నిర్వహించే సమావేశమే ప్రభల తీర్థం పరమార్థమని పెద్దలు చెబుతుంటారు.

కనుమ రోజున జరిగే ప్రభల తీర్ధం ఆకాశమే హద్దుగా జరుగుతుంది. ప్రభల తీర్ధంలోని ప్రభలను చూడడానికి భారీ సంఖ్యలో భక్తులు పోటీ పడతారు. అచ్చ తెలుగామ్మయిల్లా సాంప్రదాయ దుస్తులతో యువతులు ప్రభల అందాలతో పోటీ పడతారు.

Also Read:

Jogging In Winter: చలికాలంలో జాగింగ్ చేయడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో…

వంటగది నిర్మాణం కోసం సింపుల్ టిప్స్.. పొయ్యి, కుళాయి ఏ దిశలో ఉండాలంటే..