Chanakya Niti చాణుక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను పాటిస్తే.. జీవితంలో ఏర్పడే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya) అసాధారణ ప్రతిభా సంపన్నుడు. సమర్ధవంతమైన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త మాత్రమే కాదు అనేక విషయాలపై అవగాహన కలిగి..

Chanakya Niti చాణుక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను పాటిస్తే.. జీవితంలో ఏర్పడే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది
ChanakyaImage Credit source: Chanakya
Follow us

|

Updated on: Jan 16, 2022 | 7:46 AM

Chanakya Niti: ఆచార్య చాణక్యుడు(Chanakya) అసాధారణ ప్రతిభా సంపన్నుడు. సమర్ధవంతమైన రాజకీయవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త మాత్రమే కాదు అనేక విషయాలపై అవగాహన కలిగి ఉన్నాడు. తన అనుభవాలను  అనేక శాస్త్రాలుగా లిఖించాడు. తన జ్ఞానాన్ని ‘వంచక’గా ఉపయోగించడంలో గొప్ప పండితుడు కనుక అతన్ని కౌటిల్య అని పిలుస్తారు. చాణుక్యుడు రచించిన నీతి శాస్త్రం (chanakya niti)నేటి మానవులకు అనేక జీవిన విధానాలను నేర్పుతుంది.  వాటిని ఆచరిస్తే.. ఆ మనిషిజీవితం ఏ కలతలు, కష్టాలు లేకుండా సాఫీగా సాగిపోతుందని పెద్దల నమ్మకం.. ఈరోజు ప్రతి మనిషి జీవితంలో కూడా చాలా సమస్యలు ఉంటాయి. అయితే వాటిని కొన్ని కారణాల వల్ల ఏది తప్పు, ఏది ఒప్పు అనే తేడాను గుర్తించలేకపోతున్నారు. అలా తప్పు ఒప్పుల తేడాను గుర్తించడానికి చాణక్య నీతిలో వ్రాసిన 4 విషయాలు మీకు సహాయపడతాయి. అవి ఏమిటో తెలుసుకుందాం..

1. సర్వసాధారణంగా ఎవరికైనా దుఃఖం కలిగితే అది ఇంకొకరితో పంచుకోవడం వల్ల దుఃఖం తగ్గుతుందని అంటారు. అయితే అలా దుఃఖాన్ని ఆచార్య చాణక్యుడు ఎవరితోనూ పంచుకోకూడదని అంటాడు. ఎందుకంటే మీ బాధలను ఎవరూ తగ్గించలేరు. బదులుగా.. అవతలి వ్యక్తి అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎగతాళి చేస్తాడు. చాలా మంది వ్యక్తులు మిమ్మల్ని ఖచ్చితంగా ఓదార్చుతారు. అయితే అప్పుడు కూడా మీ బాధ పోదు. మీ బాధల ప్రభావం ఇతరులపై ఎప్పుడూ ఉండదు. కాబట్టి మీ బాధలను, మీ దుఃఖాన్ని మీకే పరిమితం చేసుకోండి.

2. భార్యాభర్తల బంధం ప్రేమతో కూడుకున్నది. జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా ఇద్దరూ ఒకరికొకరు పూర్తి మద్దతునిస్తూ ఉండాలి. అయితే మీ జీవిత భాగస్వామి ఎప్పుడూ కోపంగా ఉంటే, సరిగ్గా ప్రవర్తించకపోయినా.. ముఖంలో ద్వేషపూరిత భావన కనిపిస్తే, అలాంటి జీవిత భాగస్వామిని పొందిన కుటుంబంలో ఎప్పుడూ ఎడబాటు, దుఃఖం, బాధలతో నిండి ఉంటుంది. అటువంటి భాగస్వామితో జీవించేవారి పురోగతి ఆగిపోతుంది. అలాంటి సంబంధానికి దూరంగా ఉండటం మంచిది.

3. ఆచార్య చాణక్యుడు తన కుటుంబం గురించి బయటి వ్యక్తులతో ఏమీ చెప్పకూడదని నమ్మాడు. కొందరు తమ ఇంట్లోని రహస్య విషయాలను బయట వ్యక్తులతో పంచుకుంటూ ఉంటారు. అవకాశం ఉన్నప్పుడు, బయటి వ్యక్తులు మీ ఇంట్లో సమస్యలను సృష్టించడానికి ఈ పరిస్థితులను ఉపయోగించుకుంటారని చెప్పాడు.

4. ఆచార్య చాణక్యుడు చెప్పిన నీతి ప్రకారం, ఒక వ్యక్తి సమాజంలో చేసే పని సమాజంలో అతని గౌరవాన్ని , కీర్తిని పెంచుతుంది. గౌరవం అనేది ఆ వ్యక్తి యొక్క ఆభరణం. అలాంటి గౌరవాన్ని ఎవరైనా మంచి పనులు చేయడం ద్వారా మాత్రమే పొందగలడు. అంతేకాదు ఇది మనిషి జీవితానికి సురక్షిత మార్గం కూడా.

Also Read:  శ్రీవారి భక్తులకు అలెర్ట్.. కనుమరోజున ఏకాంతంగా శ్రీవారి పార్వేటు ఉత్సవం.. రేపు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి..

Latest Articles