Lifestyle: కళ్ల కింద నల్లటి మచ్చలా.? గ్రీన్ టీతో ఇలా చేయండి..
రాత్రుళ్లు ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండడం, గంటల తరబడి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌తో గడపడం కారణం ఏదైనా ఇటీవల కంటి కింద డార్క్ సర్కిల్ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మొహమంతా అందంగా ఉండి, కళ్ల కింద నల్లగా ఉండే చూడ్డానికి బాగుండదు. దీంతో ఈ డార్క్ సర్కిల్స్‌ను తొలగించుకోవడానికి రకరకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా...
రాత్రుళ్లు ఎక్కువసేపు నిద్రపోకుండా ఉండడం, గంటల తరబడి ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్‌తో గడపడం కారణం ఏదైనా ఇటీవల కంటి కింద డార్క్ సర్కిల్ సమస్య బారిన పడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. మొహమంతా అందంగా ఉండి, కళ్ల కింద నల్లగా ఉండే చూడ్డానికి బాగుండదు. దీంతో ఈ డార్క్ సర్కిల్స్‌ను తొలగించుకోవడానికి రకరకాల క్రీములను ఉపయోగిస్తుంటారు. అయితే ఇలా మార్కెట్లో దొరికే రసాయనాలతో కూడిన క్రీమ్‌లను ఉపయోగించడం కంటే ఇంట్లోనే సహజంగా వీటిని తగ్గించుకునే అవకాశం ఉంది. ఇందుకోసం గ్రీన్ టీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇంతకీ గ్రీన్ టీ ద్వారా డార్క్ మార్క్స్‌కు ఎలా చెక్ పెట్టొచ్చు ఇప్పుడు తెలుసుకుందాం..
* ముందుగా వేడి నీటిని తీసుకొని అందులో గ్రీన్ టీ బ్యాగ్‌ను కాసేపు నానబెట్టాలి. దీంతో గ్రీన్ టీ రడీ అవుతుంది.
* అనంతరం గ్రీన్ టీ చల్లబడే వరకు చూడాలి. చల్లబడిన వెంటనే కాటన్‌ను గ్రీన్‌టీలో ముంచాలి. అదనంగా ఉండే టీని పిండేయాలి. ఇప్పుడు కళ్లు మూసుకొని కాటన్ సహాయంతో కళ్ల చుట్టూ నెమ్మదిగా మసాజ్ చేయాలి. అనంతరం కాసేపు కాటన్‌ను అలాగే కంటిపై పెట్టుకోవాలి.
* ఇలా 10 నుంచి 15 నిమిషాలు కళ్లు మూసుకొని విశ్రాంతి తీసుకోవాలి. అయితే గ్రీన్ టీ ఎట్టి పరిస్థితుల్లో కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తపడాలి. దీనివల్ల కంటిపై దుష్ప్రభావం పడే అవకాశం ఉంటుంది.
* అయితే ఇందుకోసం కాటన్ ప్యాడ్‌లు ఉపయోగిస్తే బెటర్ అని చెప్పొచ్చు. మార్కెట్లో కాటన్ ప్యాడ్‌లు విరివిగా అందుబాటులో ఉంటాయి. కాటన్ ప్యాడ్‌ను తీసివేసి తర్వాత కొంత గ్రీన్ టీని తీసుకొని. నల్లటి మచ్చలు ఉన్న చోట కాసేపు నెమ్మదిగా మసాజ్ చేయాలి.
* ఇలా చేయడం వల్ల ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. అలాగే గ్రీన్ టీలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోకి చొచ్చుకుపోతాయి. దీంతో చర్మం మాములు రంగుకు చేరుకుంటుంది.
* చివరిగా చల్లటి నీటితో మొహాన్ని శుభ్రంగా కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా ప్రతీ రోజూ రాత్రి పడుకునే ముందు క్రమంతప్పకుండా ఒక నెల రోజుల పాటు చేస్తే డార్క్ సర్కిల్స్ సమస్యగా తగ్గుతుంది. దీనివల్ల డార్క్ సర్కిల్స్ తగ్గడమే కాకుండా శరీరరం హైడ్రేట్‌గా ఉంటుంది.
* అయితే మీరు ఒకవేళ ఏదైనా చర్మ అలెర్జీ సమస్యలతో బాధపడుతుంటే మాత్రం ముందుగా నిపుణులను సంప్రదించాలని నిపుణులను సంప్రదించడం ఉత్తమం.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..