Yoga Pose-Tree Pose: పెద్దలు హై బీపీతో బాధపడుతున్నా.. పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలన్నా ఈ యోగాసనాన్ని చేసి చూడండి
Yoga Pose-Tree Pose: ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ శరీరానికి తగినంత శ్రమ ఉండాలి. సింపుల్ వ్యాయామం, యోగాసనాల ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. కొంతమంది..
Yoga Pose-Tree Pose: ఆరోగ్యంగా ఉండాలంటే.. రోజూ శరీరానికి తగినంత శ్రమ ఉండాలి. సింపుల్ వ్యాయామం, యోగాసనాల ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. కొంతమంది శరీరం ఫిట్ గా ఉండడానికి జిమ్ ఏరోబిక్స్ వంటివి చేస్తారు. అయితే శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి యోగా మంచి ప్రయోజనకారి. ప్రస్తుత కాలంలో పని ఒత్తిడితో ప్రతి ఒక్కరూ రక్తపోటుకు గురవుతున్నారు. ఈ యోగాసనాన్ని రోజూ కనీసం 8నిమిషాల పాటు చేస్తే.. బీపీకి చెక్ పెట్టవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.. ఈ రోజు వృక్ష భంగిమ చేయు విధానం, ఆరోగ్య ప్రయోజనాల గురించి తెల్సుకుందాం
వృక్ష భంగిమ వేయు పధ్ధతి:
ముందుగా రెండు కాళ్లను ఒకదానికి ఒకటి తాకిస్తూ నిటారుగా నిలబడాలి. అనంతరం కుడికాలును పైకెత్తి.. పాదాన్ని నెమ్మదిగా ఎడమకాలి తొడ వద్ద ఉంచాలి. ఇలా అనుసరించే క్రమంలో మీ రెండు చేతులను పైకెత్తి నమస్కార భంగిమలో ఉంచాలి. ఈ భంగిమ లో కొన్నీ నిముషాలు నిలబడి.. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. తిరిగి మాములు స్టేజ్ కు చేరుకోవాలి. మళ్ళీ ఎడమకాలిని పెకెత్తి.. పాదాన్ని నెమ్మదిగా కుడికాలు తోడవద్ద ఉంచాలి. ఇలా అనుసరించే క్రమంలో మీ రెండు చేతులను పైకెత్తి నమస్కార భంగిమలో ఉంచాలి. ఈ భంగిమ లో కొన్నీ నిముషాలు నిలబడి.. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలాలి. ఇలా ఈ ఆసనాన్ని రోజూ చేయడం వలన హై బీపీ అదుపులో ఉంటుంది.
ఉపయోగాలు :
*అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. *శ్వాస వ్యవస్థ, శరీరం ఫిట్‌గా ఉంటుంది. *ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది.
Also Read: Gongura Prawns Recipe: గోదావరి జిల్లా స్టైల్‌లో గోంగూర పచ్చి రొయ్యల కూర తయారీ విధానం..