Gongura Prawns Recipe: గోదావరి జిల్లా స్టైల్‌లో గోంగూర పచ్చి రొయ్యల కూర తయారీ విధానం..

Gongura Prawns Recipe: సీఫుడ్ ఐటెమ్స్ లో రొయ్యలది స్పెషల్ ప్లేస్.. రొయ్యల బిర్యానీ, రొయ్యల ఫ్రై, కూర లనే కాదు.. గోదావరి జిల్లాల్లో రొయ్యలను బీరకాయ, వంకాయ, టమాటా వంటి..

Gongura Prawns Recipe: గోదావరి జిల్లా స్టైల్‌లో గోంగూర పచ్చి రొయ్యల కూర తయారీ విధానం..
Gongura Royyalu
Follow us

| Edited By: Surya Kala

Updated on: Jul 15, 2021 | 12:32 PM

Gongura Prawns Recipe: సీఫుడ్ ఐటెమ్స్ లో రొయ్యలది స్పెషల్ ప్లేస్.. రొయ్యల బిర్యానీ, రొయ్యల ఫ్రై, కూర లనే కాదు.. గోదావరి జిల్లాల్లో రొయ్యలను బీరకాయ, వంకాయ, టమాటా వంటి కూరగాయలతో పాటు గోంగూర, తోటకూర, చింత చిగురు వంటి ఆకులాల్లోనూ వేసి కూర చేస్తారు.. ఇక నాన్ వెజ్ కోవలోకి వచ్చిన రొయ్యలను.. గుడ్లు కలిపి కూడా వండడం విశేషం.. అయితే గోదావరి జిల్లాల్లో ఫేమస్ ఐన గోంగూర రొయ్యల కూర తయారీ విధానం ఈరోజు తెలుసుకుందాం..

కావాల్సిన పదార్ధాలు: 

రొయ్యలు- గోంగూర ఉల్లిపాయలు పచ్చిమిర్చి, కారం పసుపు ఉప్పు రుచికి సరిపడా నూనె కరివేపాకు కొత్తిమీర

పోపు దినుసులు : వెల్లుల్లి ఎండు మిర్చి ఆవాలు

తయారు చేయు పద్దతి: ముందుగా గోంగూర ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. స్టౌ పై ఒక గిన్నె పెట్టి.. కొంచెం నీరు పోసుకుని గోంగూర ఆకులను ఆ నీటిలో వేసి.. కొంచెం సేపు ఉడికించాలి. రొయ్యలను శుభ్రం చేసుకుని కడిగి ఓ పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టౌ మీద బాండీ పెట్టి.. అందులో నూనె వేసుకుని కొంచెం వేడి అయిన తర్వాత రొయ్యలను , కొంచెం పసుపు వేసి.. వేయించుకుని నూనె నుంచి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అవసరం అయితే మరికొంచెం నూనె వేసుకుని ఎండు మిర్చి , వెల్లుల్లి, ఆవాలు వేసి పోపు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. అవి దోరగా వేగిన అనంతరం అందులో అల్లంవెల్లుల్లి మిశ్రమం. వేసి.. కొద్దిసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించి పక్కన పెట్టుకున్న గోంగూర, కాస్త పసుపు, కారం, రుచికి తగినంత ఉప్పు వేసి.. మూత పెట్టుకుని కొంచెం సేపు ఉడికించాలి. తర్వాత ఆ గోంగూర మిశ్రమంలో వేయించిన రొయ్యలు వేసుకుని ఒక 10 నిముషాలు ఉడికించాలి.. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకుని దింపేసుకోవాలి.. అంతే రుచికరమైన ఘుమఘుమలాడే గోంగూర రొయ్యల కూర రెడీ.. ఇది అన్నంలోకి , చపాతీల్లోకి చాలా బాగుంటుంది

Also Read: అప్పట్లోనే దూరదర్శన్ లో ప్రసారమైన ఓ సీరియల్ లో నటించిన చిరు.. ఏ సీరియల్ అంటే