Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కొబ్బరి నూనెలో వీటిని కలిపి రాస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.. చుండ్రుకు చక్కని పరిష్కారం..

నూనెను గోరువెచ్చగా చేసి తలకు మసాజ్ చేయాలి. 30-40 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ నూనెను వాడటంతో పాటు, తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం కూడా అవసరం. ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

కొబ్బరి నూనెలో వీటిని కలిపి రాస్తే జుట్టు రాలడం ఆగిపోతుంది.. చుండ్రుకు చక్కని పరిష్కారం..
Stop Hair Fall
Follow us
Jyothi Gadda

|

Updated on: Apr 04, 2025 | 1:26 PM

ప్రస్తుత జీవన శైలి, వాతావరణ కాలుష్యం కారణంగా ప్రజలు ఎక్కువగా చర్మం, జుట్టు సంబంధిత సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నారు. చిన్న వయసులోనే జుట్టు రాలిపోవడం, తెల్ల జుట్టు వంటి సమస్యలు ఎక్కువగా ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్నాయి. దాంతో జుట్టు సంరక్షణ కోసం చాలా మంది ఖరీదైన కెమికల్‌ ఆధారిత ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. వాటితో సమస్యలు పరిష్కారం కాకపోగా, మరిన్ని సైడ్‌ఎఫెక్ట్స్‌ని కూడా ఎదుర్కొటున్నారు. కానీ, కేశ సౌందర్యం కోసం ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు.. ఇంట్లో ఉన్న కొబ్బరి నూనెతో పాటు కొన్ని పదార్థాలు కలిపి వాడితే జుట్టుకు పోషణను అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసం కలిసి రాయడం వల్ల జుట్టు కుదుళ్లు బాగా బలపడతాయి. కొబ్బరి నూనె, ఉల్లిపాయ రసం జుట్టును బలపరుస్తుంది. ఈ రెండింటినీ కలిపి అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా మారుతుంది.

కొబ్బరి నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది. ఇది తేలికపాటి నూనెగా ఉండి జుట్టులో బాగా ఇంకుతుంది. అలాంటి కొబ్బరి నూనెలో కొన్ని కలిపితే మరింత అందమైన జుట్టు మీ సొంతమవుతుంది. అలాగే, మెంతులు జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. కొబ్బరి నూనెలో మెంతులను కలిపి వేడిచేసి తలకు మసాజ్ చేస్తే జుట్టు పొడవుగా పెరుగుతుంది. ఉల్లిపాయ రసం జుట్టు ఊడకుండా అడ్డుకుంటుంది. కొబ్బరి నూనెలో ఉల్లిపాయ రసం కలిపి ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

జుట్టు సమస్యలకు ఉసిరి కూడా అద్భుతమైన ఔషధంగా చెబుతున్నారు ఆయుర్వేద నిపుణులు. ఆమ్లా జుట్టు నల్లగా, దృఢంగా మారడానికి సహాయపడుతుంది. కొబ్బరి నూనెలో ఆమ్లా పొడి కలిపి వాడితే ఉత్తమ ఫలితాలు కనిపిస్తాయి. నూనెను గోరువెచ్చగా చేసి తలకు మసాజ్ చేయాలి. 30-40 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. వారానికి 2-3 సార్లు చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఈ నూనెను వాడటంతో పాటు, తగినంత నీరు తాగడం, పోషకాహారం తీసుకోవడం కూడా అవసరం. ఒత్తిడిని తగ్గించుకుంటే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..