Onions: ఎండాకాలంలో ఉల్లిపాయ తింటున్నారా..? శరీరంలో కలిగే మార్పులు తెలిస్తే..
ఉల్లిపాయ.. ఇది భారతీయ వంటకాలలో ప్రధానమైన అంశం. ఒక్కమాటలో చెప్పాలంటే ఉల్లిపాయలు లేని మన వంటకాలు లేవని కూడా చెప్పాలి. అలాగే, మనలో చాలా మందికి ఉల్లిపాయలను పచ్చిగా తినడం అలవాటు. ఉల్లిపాయలు ప్రపంచవ్యాప్తంగా రుచి, వాసన కోసం ఉపయోగిస్తారు. ఉల్లిపాయలతో వంటకాలకు కేవలం రుచి మాత్రమే కాదు..బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం నుంచి కంటి చూపు వరకు చాలా రకాలుగా ఉల్లిచేసే మేలు అంతా ఇంతా కాదని చెబుతున్నారు. అయితే, ఎండాకాలంలో ఉల్లిపాయలు తినటం మంచిదేనా..? వేసవిలో ఉల్లిపాయ తింటే శరీరంలో కలిగే మార్పులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
Updated on: Apr 04, 2025 | 10:54 AM

డైటీషియన్లు, నిపుణులు చెప్పిన వివరాల ప్రకారం ఉల్లిపాయల్లో విటమిన్లు, మినరల్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. వేడి వల్ల వచ్చే సమస్యలు రాకుండా ఉండటానికి కూడా పచ్చి ఉల్లిపాయల్ని తినమని చాలా మంది సలహాలు కూడా ఇస్తుంటారు.

అంతేకాకుండా ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, సాధారణంగా వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అధిక వేడి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. వేసవిలో వ్యాధుల ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల, అటువంటి సమస్యల నుండి దూరంగా ఉండటానికి శరీరానికి ఎక్కువ పోషకాహారం అవసరం. అలాంటి సందర్భాలలో, ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల పలు ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా, ఉల్లిపాయలు తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. శరీరాన్ని లోపలి నుండి చల్లగా ఉంచుతుంది. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేస్తుంది. అలాగే చెమటను కూడా తగ్గిస్తుంది.

ఉల్లిపాయలో ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంటుంది. ఇందులో ఉండే సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. ఉల్లిపాయలు తినడం వల్ల చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిపాయలు రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల జీర్ణశక్తిని కూడా పెంచుతాయి.

ముఖ్యంగా వేసవిలో ఉల్లిపాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల నుంచి మిమ్మల్ని రక్షించుకోవచ్చు. వీటిని ఉడికించకుండా పచ్చిగా తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయల్లో సల్ఫర్, ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్లు బి, సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందుకే ఉల్లిపాయలు ఆరోగ్యానికి చాలా మంచివని అంటారు.

ఉల్లిపాయల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. కాబట్టి వేసవిలో ఉల్లిపాయ తింటే మన శరీరానికి అవసరమైన హైడ్రేషన్ అందుతుంది. అంతేకాదు.. ఉల్లిపాయలో ఉండే పొటాషియం ఒక ముఖ్యమైన ఎలక్ట్రోలైట్, ఇది శరీరంలో ద్రవ సమతుల్యతను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.





























