- Telugu News Photo Gallery Cinema photos Nani is taking steps with proper planning and is rushing to the next level
Nani: పక్కా ప్లానింగ్‌తో రూట్ మ్యాప్.. నెక్ట్స్ లెవల్‌కు నేచురల్ స్టార్..
సాధారణంగా డైరెక్టర్లు యూనివర్స్‌లను బిల్డ్ చేస్తుంటారు. ఆ యూనివర్స్‌లలోకి చాలా మంది హీరోలు వచ్చి వెలుతుంటారు. కానీ రూల్‌ను బ్రేక్ చేస్తున్నారు టాలీవుడ్ హీరో నాని. ఇన్నాళ్లు టైర్ 2 హీరోగా ఉన్న నేచురల్ స్టార్, ఇప్పుడు తన ఇమేజ్‌ను తానే బిల్డ్ చేసుకుంటూ నెక్ట్స్ లెవల్‌కు దూసుకుపోతున్నారు. ఈ విషయంలో పక్కా ప్లానింగ్‌తో అడుగులు వేస్తున్నారు.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Prudvi Battula
Updated on: Apr 04, 2025 | 10:30 AM

యంగ్ జనరేషన్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న హీరో నేచురల్ స్టార్ నాని. ఓ వైపు హీరోగా మరో వైపు నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు ఈ క్రేజీ హీరో. అంతేకాదు తన ఫ్యూచర్‌ను తానే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. అందుకోసమే రెండు క్రేజీ యూనివర్స్‌లను బిల్డ్ చేస్తున్నారు.

ఆల్రెడీ హిట్ సిరీస్‌తో రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన నాని, ఇప్పుడు స్వయంగా ఆ సిరీస్‌లోకి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. అదే సమయంలో శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఎనౌన్స్ చేసిన ది ప్యారడైజ్ మూవీని కూడా నయా వరల్డ్‌లో సెటప్ చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ అప్‌డేట్‌తో ది ప్యారడైజ్ కూడా యూనివర్స్‌గా మారే ఛాన్స్ ఉందంటున్నారు ఫ్యాన్స్.

ప్యారలల్‌గా రెండు యూనివర్స్‌లను క్రియేట్ చేస్తున్న నాని, ఆ సినిమాలతో తన మార్కెట్, నెట్‌వర్క్‌ను పెంచుకుంటున్నారు. ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్‌లో తన మార్క్ చూపించిన నాని, అప్ కమింగ్ సినిమాలన్నింటినీ అదే రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. దీంతో మార్కెట్ పరంగా నాని రేంజ్ ఆల్రెడీ మారిపోయింది.

హిట్ సిరీస్‌లో ఇద్దరు హీరోలు కనిపించారు. భవిష్యత్తుల్లో మరికొంత మంది హీరోలు ఈ సిరీస్‌లోకి రాబోతున్నారు. అలాగే ది ప్యారడైజ్ సిరీస్‌లోకి కూడా కొంత మంది స్టార్స్‌ను వెల్ కం చేసే ఛాన్స్ ఉంది.

ఇలా ఇతర హీరోలను ప్రొడ్యూస్ చేస్తూ తన నెట్‌వర్క్‌ను కూడా మరింత స్ట్రాంగ్ చేసుకుంటున్నారు నేచురల్ స్టార్. ఈ జనరేషన్‌లో ఇంత ప్లాన్డ్‌గా కెరీర్ బిల్డ్ చేసుకుంటున్న హీరో నాని మాత్రమే అంటున్నారు ఇండస్ట్రీ జనాలు.





























