- Telugu News Photo Gallery Cinema photos Ram Charan Peddi to Suriya Retro latest film updates from film industry
Movie Updates: పెద్ది ఫస్ట్ గ్లింప్స్ సిద్ధం.. రెట్రో నుంచి క్రేజీ అప్డేట్..
పెద్ది సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను థియేటర్లలో ప్రదర్శించేందుకు మేకర్స్ ఏర్పాట్లు. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ క్లారిటీతో పెరిగిన ప్రమోషన్ స్పీడు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రెండో సినిమాను ఎనౌన్స్. స్త్రీ 2 రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న శ్రద్ధా కపూర్ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్. సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రెట్రో క్రేజీ అప్డేట్.
Updated on: Apr 04, 2025 | 9:56 AM

పెద్ది సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఏప్రిల్ 6న శ్రీరామ నమవి సందర్భంగా గ్లింప్స్ విడుదల కానుంది. ఆ గ్లింప్స్‌ను ఏప్రిల్ 10న రిలీజ్ అయ్యే జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలతో పాటు ప్రదర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ రగ్గడ్ లుక్‌లో కనిపించబోతున్నారు.

రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ రావటంతో మరోసారి ప్రమోషన్ స్పీడు పెంచింది హరి హర వీరమల్లు టీమ్. ఏప్రిల్ 10న థర్డ్ సింగిల్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. ఏప్రిల్ 7 ఆఖరి షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ షెడ్యూల్‌లో నాలుగు రోజుల పాటు పవన్ షూటింగ్‌లో పాల్గొనేలా డేట్స్ ప్లాన్ చేశారు. మే 9న హరి హర వీరమల్లు ఆడియన్స్ ముందుకు రానుంది.

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా రెండో సినిమాను ఎనౌన్స్ చేశారు. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న సంగీత్ శోభన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నారు నిహారిక. ఈ సినిమాతో మానస శర్మ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. గతంలో ఇదే కాంబినేషన్‌లో చిన్న ఫ్యామిలీ స్టోరి అనే వెబ్ సిరీస్ చేశారు. ఇప్పుడు అదే టీమ్ నుంచి సినిమా రాబోతుంది.

స్త్రీ 2 రిలీజ్ తరువాత లాంగ్ బ్రేక్ తీసుకున్న శ్రద్ధా కపూర్, కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెన్సేషనల్ మూవీ తుంబాడ్‌కు దర్శకత్వం వహించిన రాహి అనిల్ బార్వే దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు ఓకే చెప్పారు. థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాను ఎక్తా కపూర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్‌లోనే ఉన్న ఈ మూవీ, మరో నాలుగు నెలల్లో సెట్స్ మీదకు వెళ్లనుంది.

సూర్య హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ రెట్రో. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా డబ్బింగ్ పూర్తి చేశారు సూర్య. వింటేజ్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న రెట్రో మూవీలో, పూజ హెగ్డే సూర్యకు జోడీగా నటిస్తున్నారు. ఈ సినిమాను మే 1న ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.




