Brain Health: మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. మెదడు సరిగా పనిచేస్తేనే శరీరంలో అన్ని భాగాలు చక్కగా పని చేస్తాయి. ఈ మధ్య కాలంలో పిల్లలకు, పెద్దలకు జ్ఞాప‌క‌ శ‌క్తి అనేది మందగిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు జ్ఞాప‌క‌ శ‌క్తి చాలా అవసరం. వాళ్లు చురుగ్గా ఉండాలన్నా, చదివింది మర్చిపోకుండా ఉండాలన్నా మెదడు ఆరోగ్యంగా పని చేయాలి. మెదడు సరిగా పని చేయలంటే ఆరోగ్యకరమైన..

Brain Health: మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
Foods For Brain
Follow us

| Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 19, 2024 | 9:55 PM

ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, జీవన శైలి కారణంగా మెదడుపై కూడా ప్రభావం పడుతుంది. మెదడు సరిగా పనిచేస్తేనే శరీరంలో అన్ని భాగాలు చక్కగా పని చేస్తాయి. ఈ మధ్య కాలంలో పిల్లలకు, పెద్దలకు జ్ఞాప‌క‌ శ‌క్తి అనేది మందగిస్తుంది. ముఖ్యంగా పిల్లలకు జ్ఞాప‌క‌ శ‌క్తి చాలా అవసరం. వాళ్లు చురుగ్గా ఉండాలన్నా, చదివింది మర్చిపోకుండా ఉండాలన్నా మెదడు ఆరోగ్యంగా పని చేయాలి. మెదడు సరిగా పని చేయలంటే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. చాలా మంది సరైన ఆహారం తీసుకోరు. దీని వల్ల మెదడు కూడా మొద్దు బారిపోతుంది. దీంతో అల్జీమర్స్ అనే వ్యాధి కూడా రావచ్చు. మెదడు హెల్దీగా పని చేయాలంటే.. ముఖ్యంగా జిక్, విటమిన్ ఇ, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. ఇవి సరిగ్గా అందితేనే మెదడు అనేది చక్కగా పని చేస్తుంది. మరి బ్రెయిన్ హెల్దీగా పని చేయాలంటే తీసుకోవాల్సిన ఆహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

జింక్:

జింక్ కేవలం మెదడు ఆరోగ్యంగా ఉండటం కోసమే కాదు.. శరీరం బలంగా, దృఢంగా ఉండాలన్నా జింక్ చాలా అవసరం. జింక్ ఎక్కువగా.. జనపనార విత్తనాలు, నల్ల నువ్వులు, పొద్దు తిరుగుడు పప్పు, తెల్ల నువ్వుల్లో లభిస్తాయి. వీటిని నానబెట్టి తీసుకున్నా.. ఇతర ఆహారాలతో పాటు కలిపి తీసుకున్నా మీకు జింక్ చక్కగా అందుతుంది. జింక్ ఉన్న ఆహారాలు తీసుకుంటే మెదడు కణాల పని తీరు మెరుగు పడుతుంది.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్:

మెదడు నరాలు చక్కగా పని చేయాలంటే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల త్వరగా అల్జీమర్స్ అనే వ్యాధి ఎటాక్ కాకుండా ఉంటుంది. చియా సీడ్స్, చేపలు, అవిసె గింజలు, వాల్ నట్స్ వంటి వాటిల్లో ఈ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా లభిస్తాయి.

ఇవి కూడా చదవండి

విటమిన్ ఇ:

బ్రెయిన్ సరిగా పని చేసేందుకు విటమిన్ ఇ కూడా చాలా అవసరం. ఇది మెదడులోని కణాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది. అదే విధంగా జ్ఞాప‌క‌ శ‌క్తిని పెంచుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా పొద్దుతిరుగుడు పప్పు, బాదం పప్పు, పలు రకాల కూరగాయలు వంటి వాటిల్లో లభిస్తుంది. కాబట్టి ఈ మూడు ఉన్న ఆహారాలు సరైన మోతాదులో తీసుకుంటే బ్రెయిన్ ఎంతో స్పీడుగా పని చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
మీ బ్రెయిన్ స్పీడుగా పని చేయాలంటే.. ఇవి తింటే సరిపోతుంది..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు..
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
టాటా స్టీల్‌ను కాపాడేందుకు తన ఉద్యోగాన్ని వదులుకున్న రతన్‌ టాటా
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!
ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసే ముందు ఇవి గమనించారా? లేకుంటే మోసపోతారు!
ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు.. సాంబార్‌తో క్యాన్సర్‌‌కు చెక్!
ఈ న్యూస్ వింటే షాక్ అవుతారు.. సాంబార్‌తో క్యాన్సర్‌‌కు చెక్!
ఈ బ్యాంకుల్లో డిపాజిట్స్‌ చేస్తున్నారా? వడ్డీ రేట్లు ఇలా..
ఈ బ్యాంకుల్లో డిపాజిట్స్‌ చేస్తున్నారా? వడ్డీ రేట్లు ఇలా..
నలుగురితో లవ్.. కట్ చేస్తే 49 ఏళ్లు దాటినా సింగిల్ గానే హీరోయిన్
నలుగురితో లవ్.. కట్ చేస్తే 49 ఏళ్లు దాటినా సింగిల్ గానే హీరోయిన్
బోల్తా పడిన కారు.. కట్ చేస్తే, అందులో ఉన్న వారంతా పరార్.. చివరకు
బోల్తా పడిన కారు.. కట్ చేస్తే, అందులో ఉన్న వారంతా పరార్.. చివరకు
సాయి పల్లవి అలా పిలవడంతో ఫీలయ్యాను.. శివకార్తికేయన్
సాయి పల్లవి అలా పిలవడంతో ఫీలయ్యాను.. శివకార్తికేయన్
ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ కు షాక్..వెర్డర్ బ్రెమెన్ చేతిలో ఓటమి
ఐన్‌ట్రాచ్ట్ ఫ్రాంక్‌ఫర్ట్‌ కు షాక్..వెర్డర్ బ్రెమెన్ చేతిలో ఓటమి