AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Benefits: రోజూ ఒక వెల్లుల్లి రెబ్బ తింటే మందులతో పనే ఉండదు.. ఆరోగ్యంగా బతికేయొచ్చు

వర్షాకాలం అంటేనే రోగాలు ముసురుతాయి. జలుబు, దగ్గు, జ్వరం బాధితేలే ఇంట్లో ఉంటారు. దగ్గు సిరప్, పారాసెటమాల్, యాంటీబయాటిక్స్ ఈ మూడు రకాల మందులు పిల్లల నుంచి పెద్దల వరకు అంతా వాడేస్తుంటారు. కానీ నిపుణుల సలహా లేకుండా ఈ మందులను తీసుకోవడం సరికాదు. కాబట్టి మందులు తీసుకోవడానికి బదులుగా వంట గదిలో దొరికే..

Srilakshmi C
| Edited By: |

Updated on: Oct 19, 2024 | 9:49 PM

Share
వర్షాకాలం అంటేనే రోగాలు ముసురుతాయి. జలుబు, దగ్గు, జ్వరం బాధితేలే ఇంట్లో ఉంటారు. దగ్గు సిరప్, పారాసెటమాల్, యాంటీబయాటిక్స్ ఈ మూడు రకాల మందులు పిల్లల నుంచి పెద్దల వరకు అంతా వాడేస్తుంటారు. కానీ నిపుణుల సలహా లేకుండా ఈ మందులను తీసుకోవడం సరికాదు. కాబట్టి మందులు తీసుకోవడానికి బదులుగా వంట గదిలో దొరికే ఈ ఒక్క మూలిక తీసుకున్నారంటే సహజంగానే మీ ఇమ్యునిటీ బలంగా ఉంటుంది.

1 / 5
వంటగదిలో దొరికే వెల్లుల్లి వర్షాకాలంలో శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో బలేగా పనిచేస్తుంది. వెల్లుల్లి వంటల రుచిని పెంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆరోగ్య సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది.  ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచేందుకు వెల్లుల్లి బాగా ఉపయోగపడుతుంది. ఇందులో అల్లిసిన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. జలుబు, దగ్గు వంటి సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు.

2 / 5
మీరు ఆర్థరైటిస్ నొప్పితో బాధపడుతున్నారా? అయితే ఈరోజు నుంచి వెల్లుల్లి తినడం ప్రారంభించండి. నూనె, వెల్లుల్లిని కలిపి వేడి చేయాలి. ఆ తర్వాత ఆ వెల్లుల్లి నూనెను నొప్పి ఉన్న ప్రదేశంలో రాయాలి. ఇలా చేస్తే కొన్ని రోజుల్లో నొప్పి తగ్గుతుంది.

3 / 5
వెల్లుల్లి తినడం వల్ల జలుబు, దగ్గు నుంచి ఉపమశమనం పొందొచ్చు. ప్రతిరోజూ ఒక వెల్లుల్లి రెబ్బను తప్పక తినాలి. నేరుగా తినకూడదనుకుంటే, నీటితో మింగవచ్చు. లేదా వెల్లుల్లి సప్లిమెంట్లను తినవచ్చు. అది కూడా ప్రయోజనకరంగానే ఉంటుంది.

4 / 5
తరచుగా జలుబుతో బాధపడేవారు వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారని అధ్యయనాలు చెబుతున్నాయి. పైగా వెల్లుల్లి గుండె ఆరోగ్యాన్ని పునరుద్ధరించడానికి, వివిధ దీర్ఘకాలిక వ్యాధులను తొలగించడానికి కూడా సహాయపడుతుంది.

5 / 5