అతివేగంతో బోల్తా పడిన కారు.. కట్ చేస్తే, అందులో ఉన్న వారంతా పరార్.. చివరకు..

తెలంగాణలో మత్తు రవాణా కొత్త పుంతలు తొక్కుతోంది. మెదక్ జిల్లాలో బోల్తా పడ్డ కారులో గంజాయి చూసి పోలీసులు విస్తుపోయారు.. చివరకు కారును, కారులో ఉన్న గంజాయ్ ను పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అతివేగంతో బోల్తా పడిన కారు.. కట్ చేస్తే, అందులో ఉన్న వారంతా పరార్.. చివరకు..
Crime News
Follow us

|

Updated on: Oct 19, 2024 | 9:34 PM

తెలంగాణ ప్రభుత్వం మత్తు రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నా.. ఎక్కడో ఒకచోట దాని ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్ జిల్లాలో గంజాయి గప్పుమంటోంది. రామాయంపేట 44వ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో గంజాయి మూటలు బయటపడ్డాయి. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వెళ్తున్న షిఫ్ట్ డిజైర్ కార్ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదానికి గురైంది. గంజాయి రవాణాతో జాతీయ రహదారిపై అతివేగంతో వెళ్తున్న కారు బోల్తాపడింది. కారు వదిలిన దుండగులు పరారయ్యారు. అదే రూటులో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు కారు ప్రమాదాన్ని గుర్తించారు. కారును తనిఖీ చేయగా అందులో గంజాయి మూటలు బయటపడ్డాయి. మూడు సంచుల్లో 32 ప్యాకెట్లను గుర్తించారు. సుమారు 90 కేజీలకు పైగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు.

ఓవైపు స్టాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ గంజాయికి బానిసవ్వటమే కాకుండా, విక్రయిస్తూ పోలీసుల చేతికి చిక్కి జైలు పాలయ్యారు నలుగురు నిందితులు. ఈఘటన హైదరాబాద్‌ కె.పి.హెచ్.బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని పలు జిల్లాలకు చెందిన నలుగురు యువకులు రాజేశ్, నాగవంశీ, రమేశ్ కృష్ణ, సాయిగోపి విహారి హాస్టల్‌లో ఉంటూ సాప్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నారు. వీరు గంజాయిసేవించడమే కాకుండా, దానిని యువకులకు విక్రయిస్తూ పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి 1300 గ్రాముల గంజాయి, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నిందితులు రిమాండ్‌కి తరలించారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..