- Telugu News Photo Gallery World's most expensive nail polish costs more than 3 Mercedes, know its price here
World’s Most Expensive Nailpolish: ఈ నెయిల్ పాలిష్ ధరతో ఏకంగా 3 మెర్సిడెజ్ బెంజ్ కార్లు కొనేయొచ్చు.. ఎందుకంత స్పెషలంటే
అందం గురించిన ప్రస్తావన వస్తే మగువల అందాన్ని పొగడని కవి లేడంటే అతిశయోక్తి కాదేమో..! అవును.. అమ్మాయిలు అందానికి మరింత ప్రాధాన్యత ఇస్తారు. ఖరీదైన సౌందర్య ఉత్పత్తులతో తమ సౌందర్యానికి మెరుగులు దిద్దుతుంటారు. అయితే సాధారణంగా గోర్లకు పెట్టుకునే నెయిల్ పాలీష్ ధర రూ.10, మహా అయియే రూ.100 వరకు ఉంటుంది. కానీ ఈ నెయిల్ పాలీష్ ధరతో ఏకంగా మూడు బెంజ్ కార్లు కొనేయొచ్చు. ఇంత ఖర్చుపెట్టి ఎవరు కొంటారులే అనుకుంటే తప్పులో కాలేసినట్లే. ముందే చెప్పాంగా.. అందం కోసం అమ్మాయిలు ఖర్చుకు వెనకాడరని..
Updated on: Oct 19, 2024 | 8:46 PM

గోళ్ల అందాన్ని పెంపొందించే నెయిల్ పాలిష్ ప్రతి అమ్మాయి తప్పనిసరిగా వినియోగిస్తుంది. సాధారణంగా నెయిల్ పాలిష్ ధర రూ.10 నుంచి రూ.100లలోపు ఉంటుంది. ఇంకా బెస్ట్ బ్రాండ్ నెయిల్ పాలిష్ అయితే రూ.500 వరకు ఉంటుంది. నాణ్యతమను బట్టి వీటి ధర ఉంటుంది.

అయితే కోట్లు ఖరీదు చేసే ఈ నెయిల్ పాలిష్ గురించి మీరెప్పుడైనా విన్నారా? అవును.. ఒక్క నెయిల్ పాలిష్ బాటిల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్‌గా పేరుగాంచింది. దీని ధర ఎన్నివేల కోట్లో తెలిస్తే నోరెళ్లబెడతారు.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ పేరు 'అజేచర్' . ఈ ఖరీదైన నెయిల్ పాలిష్‌ను లాస్ ఏంజిల్స్‌కు చెందిన డిజైనర్ ఎజెటూర్ పోగోసియాన్ తయారు చేశారు. ఈ కంపెనీ తయారు చేసే లగ్జరీ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం ఉంది.

అంతెందుకు ఈ కంపెనీ తయారు చేసిన నెయిల్ పాలీష్ కొనాలంటే కోట్లకు కోట్లు పెట్టి కొనాల్సిందే. ఇందులో ప్రత్యేకంగా ఏమీ లేదని అనిపించవచ్చు. ఈ నెయిల్ పాలిష్ దూరం నుంచి మామూలుగా కనిపించినప్పటికీ, దీని తయారీకి దాదాపు రూ.1,63,66,000 ఖర్చవుతుంది. దీని తయారీలో ఖరీదైన 267 క్యారెట్ బ్లాక్ డైమండ్‌లను ఉపయోగిస్తారట. ఒక నెయిల్ పాలిష్ ధరతో 3 Mercedes-Benz కార్లను కొనుగోలు చేయవచ్చు.

అజాచర్ నెయిల్ పాలిష్ ధర సుమారు 2,50,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.1 కోటి 90 లక్షలు. నెయిల్ పాలిష్ ప్రపంచంలో దీనిని 'బ్లాక్ డైమండ్ కింగ్' అని కూడా పిలుస్తారు. నివేదికల ప్రకారం.. ఇప్పటివరకు 25 మంది మాత్రమే ఈ ఖరీదైన బ్లాక్ డైమండ్ నెయిల్ పాలిష్‌ను కొనుగోలు చేశారు.




