AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana GO 29: అసలేంటి జీవో 29.. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలకు కారణం అదేనా..? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ

తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని.. జీవో 29ను రద్దు చేయాలని.. అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నారు. దీంతో పోలీసులు పలువురు అభ్యర్ధులను అదుపులోకి తీసుకుని వాహనాల్లో తరలించారు. అయితే.. జీవో 29 అంటే ఏమిటి..? ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు.. వివరాలు తెలుసుకోండి..

Telangana GO 29: అసలేంటి జీవో 29.. గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనలకు కారణం అదేనా..? సుప్రీంకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
Group -1 mains aspirants - Go 29 Issue
Shaik Madar Saheb
| Edited By: |

Updated on: Oct 20, 2024 | 11:06 AM

Share

జీవో 29ను రద్దు చేయాలంటున్న గ్రూప్‌ వన్‌ అభ్యర్థులు.. పాత జీవో 55 ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం నిబంధనలపై వెనక్కి తగ్గేదే లేదంటోంది. జీవో 29 ప్రకరామే పరీక్షలు ఉంటాయని చెబుతోంది. ఇంతకూ జీవో 29 వర్సస్‌ 55 వివాదం ఏంటి..? ఏ జీవోలో ఏముంది..? హైకోర్టు క్లియరెన్స్‌ ఇవ్వడంతో సోమవారం నుండి గ్రూప్‌-1 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది ప్రభుత్వం. అటు విద్యార్థులు మాత్రం పట్టువీడ్డం లేదు. ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయడం లేదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఏం చెబుతుందోనన్న ఆసక్తి నెలకుంది. ఈ నేపథ్యంలో ఈ జీవో వివాదం ఏంటనే చర్చ మొదలయింది.

2024లో జీవో 29 తెచ్చిన రేవంత్‌ ప్రభుత్వం..

కేసీఆర్‌ ప్రభుత్వం 2022లో జారీ చేసిన గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను కోర్టు తీర్పుతో 2024 రద్దు చేసింది రేవంత్‌రెడ్డి ప్రభుత్వం. ఆ సమయంలో కొత్త నోటిఫికేషన్‌ను జారీ చేస్తూ..జీవో 29ను తీసుకువచ్చింది. గత ప్రభుత్వం అమలు చేసిన జీవో 55లో 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌లో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ క్రమంలో 40 శాతం అభ్యర్థులను మెరిట్‌ ప్రకారం ఎంపిక చేస్తే.. 60 శాతం అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లను వర్తింపు చేస్తారు. దీంతో మెరిట్‌ ఉన్న రిజర్వుడు అభ్యర్థులు ఓపెన్‌ కోటాలో ఎంపికవుతారు. మెరిట్‌ తక్కువ ఉన్న అభ్యర్థులకు..రిజర్వుడు కేటగిరిలో అవకాశం లభిస్తోంది. దీనివల్ల అటు ఓపెన్‌ కోటాలోనూ..ఇటూ రిజర్వుడు కోటాలో కూడా రిజర్వేషన్లు ఉన్న అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుంది.

జీవో 29తో అవకాశాలు కోల్పోతామంటున్న రిజర్వుడు అభ్యర్థులు

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 29 ప్రకారం..రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్‌ ప్రకారం అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఉద్యోగాల కేటాయింపులోనే రిజర్వేషన్లు వర్తింపు జేస్తారు. అందువల్ల ఓపెన్ కేటగిరీలో ఎంపికైన రిజర్వుడు అభ్యర్థులను కూడా రిజర్వేషన్ కేటగిరీ కిందనే పరిగణిస్తున్నారు. దీనివల్ల రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నవారికి తీవ్ర అన్యాయం జరుగుతోందని అభ్యర్థుల వాదన.

రిజర్వుడ్ అభ్యర్థులకు సంబంధించి రాజ్యాంగ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ జీవోను తీసుకువచ్చిందని ఆరోపిస్తున్నారు అభ్యర్థులు. తమ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకూ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకే మొగ్గు చూపుతోంది. మరి సుప్రీంకోర్టు ఏం చెబుతుందో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..