దానిమ్మ జ్యూస్‌లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల కారణంగా రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
స్కిన్ అండ్ హెయిర్ కేర్‌కు అద్బుతంగా పనిచేస్తుంది. రోజూ దానిమ్మ జ్యూస్ తాగితే చర్మం రంగులో కూడా మార్పు కన్పిస్తుంది. ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
దానిమ్మ జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
దానిమ్మ జ్యూస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. సీజన్ మారినప్పుడు వచ్చే వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది.
రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది.
చర్మంపై ముడతలు పోతాయి. వృద్ధాప్య లక్షణాలు దూరమౌతాయి. జుట్టు రాలే సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాల కారణంగా జుట్టు బలంగా ఉంటుంది.
దానిమ్మ జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా ఉదయం వేళ తాగడం వల్ల ఇందులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్త నాళాల్ని క్లీన్ చేసి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి.
గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గుండె సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. శరీరానికి ఇన్‌స్టంట్ ఎనర్జీ లబిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ , కాల్షియం కారణంగా రక్త హీనత సమస్య తొలగిపోతుంది.