మెదడుకు రక్తప్రసరణ సాఫీగా అందేలా చేయడంలో డార్క్ చాక్లెట్ బాగా ఉపయోగపడుతుంది. దీంతో జ్ఞానపశక్తి పెరుగుతుంది. మెదుడు చురుగ్గా పని చేస్తుంది.
బీట్ రూట్ కూడా మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో సహజంగా లభించే నైట్రేట్లు రక్తప్రసరణకు తోడ్పడుతాయి. దీంతో మెదడుకు ఆక్సిజన్ సమృద్ధిగా లభిస్తుంది.
పసుపును కూడా క్రమం తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు.
అవిసె గింజల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచడంలో ఎంతగానో తోడ్పడుతాయి.
మనం ఎంతో ఇష్టపడి తినే చికెన్ మెదడుకు మేలు చేస్తంది. చికెన్‌ను తీసుకుంటే సెరటోనిన్ మంచి నిద్రకు దోహదపడుతుంది. పరోక్షంగా ఇది మెదడు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే ఆకుకూరలను కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పాలకూర, కేల్, క్యాబేజీ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
టమాటాలో ఉండే బీటాకెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అల్జీమర్స్‌ను దూరం చేయడంలో తోడ్పడుతాయి. అందుకే వీటిని క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.