రెస్టరెంట్లలో భోజనం చేసే ప్లేట్లు ఎందుకు తెల్లగా ఉంటాయో తెలుసా?
19 October 2024
TV9 Telugu
TV9 Telugu
రెస్టరంట్లలో భోజనమంటే ఎవరికైనా సరదానే! ప్రత్యేక సందర్భాల్లో స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి లంచ్, డిన్నర్లకు వెళ్తుంటాం
TV9 Telugu
నచ్చిన వంటకాల రుచిని ఆస్వాదిస్తుంటాం. అయితే ఈ క్రమంలో చాలామంది ఎక్కువగా తినడానికి రెస్టారెంట్లకు వెళ్లి తమకు ఇష్టమైన ఆహారాలు అన్నింటినీ అర్డర్ చేసి ఆరగిస్తుంటారు
TV9 Telugu
రెస్టరంట్లో అడుగుపెట్టగానే మనం చేసే మొదటి పని.. మెనూ చూడడం. ఈ క్రమంలో అందులో ఉన్న వెరైటీ ఆహారపదార్థాలు మన నోరూరిస్తుంటాయి. దీంతో అప్పటివరకు రుచి చూడని వాటిని ఆర్డర్ చేస్తుంటాం
TV9 Telugu
కానీ మీరెప్పుడైనా గమనించారా? హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం అందించడానికి తెల్లటి ప్లేట్లు మాత్రమే ఎందుకు ఉపయోగిస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తారో మీకెప్పుడైనా అనుమానం వచ్చిందా..
TV9 Telugu
మీరు కుటుంబంతో కలిసి రెస్టారెంట్ హోటల్‌కి వెళ్లినప్పుడు హోటళ్లలో భోజనం వడ్డించేటపుడు తెల్లటి పాత్రలు వాడటం మీరు చూసే ఉంటారు. అయితే రెస్టారెంట్లలో తెల్లటి ప్యాన్లను ఉపయోగించడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది
TV9 Telugu
వైట్ ప్లేట్‌లో వడ్డించే వంటకాలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయట. అందుకే తినాలనే కోరిక పెరుగుతుంది. తెల్లటి ప్లేట్‌పై ఎలాంటి డిజైన్ లేనందున కస్టమర్ల దృష్టి మళ్లించడానికి వీలుండదు. తనకు కావాల్సినంత ఆహారం మాత్రమే తింటాడు
TV9 Telugu
పైగా తెల్లటి పాత్రలు ఎన్ని సార్లు కడిగినా పాడవవు. కాబట్టి అందుకే రెస్టారెంట్లలో తరచుగా వీటిని ఉపయోగిస్తుంటారు. తెలుపు రంగు ఆహారానికి పరిశుభ్రమైన రూపాన్ని ఇస్తుంది
TV9 Telugu
ఈ కారణంగా తెలుపు రంగు ప్లేట్లు, పాత్రలను మాత్రమే రెస్టారెంట్లు, హోటళ్లు ఉపయోగిస్తుంటారు. అలాగే రెస్టారెంట్లలో ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైన ఆహారాన్ని మాత్రమే తినేందుకు మొగ్గుచూపడటం మంచిది