తరచూ రోగాల బారిన పడొద్దంటే.. 

Narender Vaitla

19 October 2024

తీసుకునే ఆహారంలో సిట్రస్‌ పండ్లను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఆరెంజ్‌, నిమ్మకాయ, కివీ వంటి ఫుడ్స్‌ను తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే బెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలోని విటమిన్ సి , ఫైబర్ కంటెంట్‌ను ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెంచడంలో పుచ్చకాయ కూడా బాగా ఉపయోపగుడుతంది. ఇందులో విటమిన్ ఎ, సిలతో పాటు.. యాంటీఆక్సిడెంట్ లైకోపీన్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఆకుకూరలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల తరచూ వ్యాధుల బారిన పడడం తగ్గుతుంది. వీటిలోని విటమిన్లు ఎ, సి, కెతో పాటు.. ఐరన్, ఫోలేట్ వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

అల్లంలో ఉండే ఎన్నో దివ్యౌషధాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని గుణాలు వికారం, కడుపులో మంటతోపాటు జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల కూడా రోగనిరోధక పనితీరుకు కీలకమైన గట్ బ్యాక్టీరియా యొక్క ఆరోగ్యకరమైన సంతులనాన్ని నిర్వహించడానికి సహాయపడుతుంది.

పసుపులో ఉండే కర్కుమిన్ శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీతో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. పసుపును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.