AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dried Mango Leaves: ఎండిన మామిడి, జామ, పనస ఆకులకు ఆ దేశంలో భలే గిరాకీ.. ఒక్క ప్యాకెట్ రూ. 500.. ఎందుకు ఉపయోగిస్తారంటే..

కాదేదీ కవితకు అనర్హం అన్నాడు శ్రీ శ్రీ.. నేటి మానవుడు కాదేదీ వ్యాపారానికి అనర్హం అంటున్నాడు. ఇప్పుడు పట్టణాల్లో పండగలు పర్వదినాల సమయంలో పువ్వులు, పండ్లను మాత్రమే కాదు మామిడి ఆకులను, చివరకు దర్భ గడ్డిని కూడా కొనుక్కోవల్సిందే. అయితే ఎండబెట్టిన మామిడి, పనస, జామ ఆకులను UK సూపర్ మార్కెట్ లో చిన్న చిన్న ప్లాస్టిక్ సంచులలో ప్రశాంతంగా అమ్ముతున్నారు. ప్రస్తుతం దీనిని సంబంధించిన ఒక రీల్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది.

Dried Mango Leaves: ఎండిన మామిడి, జామ, పనస ఆకులకు ఆ దేశంలో భలే గిరాకీ.. ఒక్క ప్యాకెట్ రూ. 500.. ఎందుకు ఉపయోగిస్తారంటే..
Dried Mango Leaves
Surya Kala
|

Updated on: May 10, 2025 | 5:20 PM

Share

హిందూ ధర్మంలో మామిడి ఆకులకు విశిష్ట స్థానం ఉంది. శుభకార్యాలలో, ఫంక్షన్లలో ఈ మామిడి ఆకులను ఇంటికి తోరణాలుగా అలంకరిస్తారు. కలశంలో మామిడి కొమ్ముని ఉపయోగిస్తారు. ఇలాంటి విశిష్టమైన మామిడి ఆకుల వినియోగం ఇంటికి శుభాన్ని తెస్తుందని నమ్మకం. అయితే ఇప్పుడు ఈ ఎండిన మామిడి, జామ, పనస ఆకులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఇప్పుడు ఒక రీల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది యుకే లోని ఒక స్టోర్ కి సంబదించిన రీల్.. అందులో మామిడి, పనస, జామ ఆకులను చిన్న చిన్న ప్లాస్టిక్ సంచుల్లో పెట్టి సేల్ చేస్తున్నారు. ఒకొక్క ప్యాకెట్ అంటే £4.49. అంటే మన దేశ కరెన్సీలో సుమారు రూ. 500. ఈ వీడియో చూసి ఒక నెటిజన్ మా ఇంటికి రండి.. నేను మీకు రెండు కిలోల మామిడి ఆకులు ఉచితంగా ఇస్తాను. అంతేకాదు టీ కూడా ఇస్తానని కామెంట్ చేశాడు.

ఇప్పుడు భారతీయులు మీ ఇంటి వెనుక ప్రాంగణం ఊడ్చి ఎండిన మామిడి ఆకులు పడేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి. ఇక జామ ఆకులు, పనస ఆకులను పడేసే ముందు ఇక నుంచి ఒకటి రెండు సార్లు ఆలోచించండి అంటూ సరదాగా కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ ఎండిన ఆకులను ట్రెండీ డీటాక్స్ పానీయాల తయారీకి మాత్రమే కాదు అక్వేరియంలో కూడా వేయడానికి ఉపయోగిస్తున్నారు.

అవును మీరు చదివింది నిజమే. చేపల ఎక్వేరియంలో ఈ ఎండిన ఆకులను వేస్తున్నారు. ముఖ్యంగా మామిడి, జామ ఆకులను జలచరాలు ఇష్టపడతాయి. మంచినీటి ట్యాంకుల్లో మామిడి ఆకులను జోడించినప్పుడు, ఈ ఆకులు నెమ్మదిగా టానిన్లను విడుదల చేస్తాయి. ఇవి నీటిలో pH ని తగ్గించడంలో సహాయపడతాయి. అనేక ఉష్ణమండల చేపలు సహజ ఆవాసాలుగా మారుస్తాయి. ఈ ఎండిన ఆకులు బయోఫిల్మ్ పెరుగుదలకు కూడా మద్దతు ఇస్తాయి. ఇవి చిన్న రొయ్యలు, కొన్ని రకాల చేపలకు ఒక రకమైన బఫే. కనుక ఎండిన మామిడి ఆకులను ప్యాకెట్ గా చేసి ఒకొక్కటి రూ. 500లకు అమ్ముతున్నారు. వీటిని డిజైనర్ గ్లాస్ ట్యాంక్‌లో వేస్తున్నారు.

ఎండిన ఆకుల ఉపయోగాలు ఏమిటంటే

ఎండిన మామిడి ఆకులు అక్వేరియం సౌందర్యానికి మాత్రమే కాదు. తాజా లేత మామిడి ఆకులను కొన్నిసార్లు గిరిజన లేదా తీరప్రాంత వంటకాల్లో ఉపయోగిస్తారు. అయితే ఎండలో ఎండబెట్టిన ఆకులను ఆహార పదార్థాలకు రుచిని జోడించడానికి ఉపయోగిస్తారు. పొగ కోసం కాలుస్తారు. జలుబు, దగ్గుకు ఇంటి నివారణలలో ఉపయోగిస్తారు. పొడిగా చేసి ఆరోగ్య సప్లిమెంట్‌గా తీసుకుంటారు.

ఆయుర్వేదం, జానపద వైద్యంలో ఎండిన మామిడి ఆకుల పొడి రక్తంలో చక్కెర నియంత్రణ, జీర్ణక్రియ, వాపుకు సహాయపడుతుందని నమ్ముతారు. కొందరు ఎండిన పొడిని ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటారు. మరికొందరు దీనిని టీలు లేదా ఇంట్లో తయారుచేసిన మూలికా గుళికలలో కలుపుతారు. ఇది అంత రుచికరంగా ఉండదు. కానీ ఆరోగ్యాన్ని ఇష్టపడేవారికి ఇది మంచి ఆదరణ ఉంది.

ఇంట్లో దీన్ని ఎలా తయారుచేసుకోవాలంటే

పండిన మామిడి ఆకులు (స్ఫుటంగా అయ్యే వరకు ఎండబెట్టినవి) సేకరించి వాటిని బూజు పట్టకుండా ఎండలో ఎండబెట్టాలి. ఇలా బాగా ఎండిన మామిడి ఆకులను మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మామిడి ఆకుల పౌందర్ ని తడి లేని గాజు సీసాలో వేసుకుని నిల్వ చేసుకోవాలి.

ఈ పొడిని ఎలా ఉపయోగించాలంటే

  1. గోరువెచ్చని నీటిలో ½ స్పూన్ కలిపి భోజనానికి ముందు త్రాగాలి.
  2. హెర్బల్ టీ లో ఈ పొడిని జోడించవచ్చు
  3. స్మూతీలలో చిటికెడు చల్లుకోవచ్చు

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)