Beauty Tips: పెళ్లికి ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే మీ అందం చెదిరిపోతుంది..!

Beauty Tips: పెళ్లంటేనే సందండి. ఆ సందడిలో అనేక కార్యక్రమాలు మిళితమై ఉంటాయి. అందుకే.. ప్రతీ జంట తమ వివాహంలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు.

Beauty Tips: పెళ్లికి ముందు ఈ తప్పులు అస్సలు చేయకండి.. లేదంటే మీ అందం చెదిరిపోతుంది..!
Beauty Tips
Follow us

|

Updated on: Mar 09, 2022 | 6:40 AM

Beauty Tips: పెళ్లంటేనే సందండి. ఆ సందడిలో అనేక కార్యక్రమాలు మిళితమై ఉంటాయి. అందుకే.. ప్రతీ జంట తమ వివాహంలో ప్రత్యేకంగా కనిపించాలని కోరుకుంటారు. చాలా మంది యువతి, యువకులు తమ పెళ్లికి ప్రత్యేకంగా సిద్ధమవుతారు. అందంగా కనిపించేందుకు పార్లర్లకు వెళ్లి మేకోవర్ చేయించుకుంటారు. అన్ని రకాల చర్మ చికిత్సలను చేయించుకుంటారు. ఫేషియల్, బ్లీచింగ్, ఇతరత్రా చేయించుకుంటారు. అయితే, మనం శరీరంలో చర్మం అత్యంత సున్నితమైనది. ఈ విషయాన్ని గుర్తెరిగి ఏ పని అయినా చేసుకోవాలని వార్నింగ్ ఇస్తున్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్స్. చాలా జాగ్రత్తగా ట్రీట్‌మెంట్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సమయంలో చర్మం మెరవాలనే ఉద్దేశంతో ఎలా పడితే అలా మేకోవర్ అయితే.. అసలుకు మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పెళ్లికి రెండు, మూడు రోజుల ముందు చేయకూడని ముఖ్యమైన తప్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం.

1) బ్లీచ్, ఫేషియల్స్.. మీరు 2-3 రోజుల్లో వివాహం చేసుకోబోతున్నట్లయితే, పెళ్లికి ముందు రోజు అస్సలు బ్లీచింగ్ చేయించుకోవద్దు. ఇది చర్మంపై ప్రతిచర్య చూపి మంటను కలిగిస్తుంది. ఆ మంట పెళ్లి సమయానికి తగ్గకపోగా.. సమస్య మరింత జఠిలమయ్యే ఛాన్స్ ఉంది. అయితే, మీ చర్మ రకానికి సరిపోయే ఉత్పత్తులను తెలుసుకుని.. వాటిని పెళ్లికి కనీసం ఎనిమిది వారాల ముందు ట్రయల్ చేయవచ్చు. అవి వర్కౌట్ అయితే.. పెళ్లి సమయంలో ట్రై చేయొచ్చు. పెళ్లికి మూడు రోజుల ముందు తప్పనిసరిగా ఫేషియల్‌కు దూరంగా ఉండాలని సూచించారు నిపుణులు.

2) బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ వెలికితీత.. పెళ్లికి ముందు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ క్లీనింగ్ వంటి కార్యక్రమాలేవి పెట్టుకోవద్దు. మూడు నుండి ఐదు రోజుల వరకు చర్మంపై మచ్చలు, స్కాబ్‌లు అలాగే ఉండిపోతాయి. ఫలితంగా పెళ్లి సమయంలో ఆ మచ్చలు మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంది. అంతేకాదు.. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ని సరిగా క్లీన్ చేయకపోతే.. మొఖమంతా వ్యాప్తి చెందే అవకాశం ఉంది. కాబట్టి.. పెళ్లికి ఒక వారం నుంచి 10 రోజుల ముందు వరకు ఇలాంటి కార్యక్రమాలేవి పెట్టుకోకపోవడం ఉత్తమం. 3) మీరు ఇంతకు ముందెన్నడూ ప్రయత్నించని వంటింటి చిట్కాలను(Home Remedies) అస్సలు ప్రయత్నించవద్దు 4) పెళ్లికి 3 రోజుల ముందు కెమికల్ పీల్స్, లేజర్ ట్రీట్‌మెంట్స్ చేయించుకోవద్దు. పెళ్లి రోజుకు మూడు వారాల ముందు పీల్స్ ట్రీట్‌మెంట్ ఆపేయడం ఉత్తమం అని చెబుతున్నారు. ఇక లేజర్ ట్రీట్‌మెంట్ అయితే ఒకవారం ముందు చేయించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. 5) మీరు బొటాక్స్, ఫిల్లర్లు లేదా థ్రెడ్ లిఫ్ట్‌లను ప్రయత్నించాలనుకుంటే పెళ్లికి ఒక నెల ముందు చేయండి. ఈ విధంగా ఉత్తమ ఫలితాలను పొందవచ్చు. ఈ ప్రక్రియల తర్వాత ఏర్పడే గాయాలు, వాపు మానటానికి ఒక వారం సమయం పడుతుంది. 6) మీరు ఇప్పటికే ఉపయోగించే, మీ చర్మానికి సరిపోయే సౌందర్య సాధనాలను ఉపయోగించడం మంచిది. కొత్త సౌందర్య ప్రయోగాలు చేయడం మానుకోవడం ఉత్తమం. కొత్త క్రీమ్స్, కాస్మోటిక్స్ వాడటం వల్ల అలర్జీ వచ్చే ప్రమాదం ఉంది. మీ ముఖంపై దద్దుర్లు వచ్చే అవకాశం కూడా ఉంది.

చివరగా నిపుణుల అభిప్రాయం ప్రకారం.. యువతీ యువకులు ఎవరైనా తమ పెళ్లికి కనీసం 3 నెలల ముందు చర్మ చికిత్సలను చేయించుకోవడం ఉత్తమం. దానికంటే ముందు.. చర్మవ్యాధి నిపుణలను సంప్రదించడం మరింత శ్రేయస్కరం. పెళ్లి రోజున మరింత అందంగా కనిపించడానికి బెస్పోక్ ట్రీట్‌మెంట్‌ను తీసుకోండని సలహా ఇస్తున్నారు బ్యూటీ ఎక్స్‌పర్ట్స్.

గమనిక: ప్రజల సాధారణ ఆసక్తుల దృష్ట్యా.. బ్యూటీ ఎక్స్‌పర్ట్స్ సలహాల, సూచనలను ఇక్కడ పబ్లిష్ చేయడం జరిగింది. ముఖారవిందం కోసం ఏదైనా చికిత్స తీసుకునే ముందు సంబంధిత వైద్యులను సంప్రదించడం సరైనది.

Also read:

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..