Health Tips: రాగులతో ఆరోగ్యమే కాదు అందం కూడా పెరుగుతుంది.. అదెలాగో ఇక్కడ చూడండి..
Health Tips: రాగులు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సిరి ధాన్యాలలో రాగులకు ప్రాముఖ్యత చాలానే ఉందని చెప్పాలి.
Health Tips: రాగులు తినడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సిరి ధాన్యాలలో రాగులకు ప్రాముఖ్యత చాలానే ఉందని చెప్పాలి. రాగులను ఎన్నోరకాలుగా తీసుకుంటాం. రాగి పిండితో జావ చేసుకోవడం, రొట్టెలు చేసుకోవడం, రాగి సంగటి చేసుకోవడం సహా రకరకాల పదార్థాలను చేసుకుని తినవచ్చు. రాగులతో చేసుకుని తినే పదార్థాలు మన శరీరానికి ఎంతో శక్తినిస్తాయి. డీహైడ్రేషన్ సమస్యకు చెక్ పెట్టడంతో పాటు.. అనేక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
రాగులతో కలిగే ఇతర ప్రయోజనాలు.. 1. రాగుల్లో అమినోయాసిడ్స్ వీటిన ట్రిప్టోఫాన్ అనే అమినోఆమ్లం కలిగి ఉండటం వల్ల రాగులు ఆకలి తగ్గిస్తుంది. బరువును నియంత్రణలో ఉంచుతుంది. 2. రాగిపిండితో తాయారు చేసే ఆహారాలు తీసుకోవడం వల జీర్ణక్రియను నిదానం చేస్తుంది. 3. రాగుల్లో ఉన్న ఫైబర్ వల్ల కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాంతో అధికంగా ఆహారం తీసుకోవడాన్ని నియంత్రిస్తుంది. 4. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. 5. మధుమేహంతో బాధపడేవారు రాగులతో చేసిన ఆహార పదార్థాలు తింటే ఫలితం ఉంటుంది. 6. రాగుల్లో ఐరన్ పుష్కలంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయట పడవచ్చు. 7. రాగుల్లో అమైనో యాసిడ్ లెసిథిన్, మేథినోన్ ఉంటుంది. ఇది కాలేయంలోని అదనపు కొవ్వును తొలిగిస్తుంది. 8. అధిక రక్తపోటు నివారిణిగా పని చేస్తుంది. 9. రాగుల్లో ప్రోటీన్లు, ఎ, బి, సి విటమిన్లు, మినరల్స్ తదితరాలు ఉంటాయి. 10. గుండె బలహీనత, ఉబ్బసం తగ్గిస్తుంది. 11. శరీరంలో నైట్రోజన్ సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
అందాన్ని కూడా పెంచుతుంది.. రాగులను నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే వృద్ధాప్య ఛాయలు త్వరగా రావు. చర్మం కాంతివంతంగా, మృదువుగా ఉంటుంది. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు. రాగుల్లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వయస్సును తక్కువగా కనబడేలా చేస్తుంది. రాగులను క్రమం తప్పకుండా వినియోగిస్తుంటే వృద్ధాప్యంను దూరంగా ఉంచడానికి సహాయపడుతుంది.
Also read:
Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!
Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..