Health Tips: పచ్చి బఠానీలు బాగా తింటున్నారా?.. అయితే, ఈ అద్భుత ప్రయోజనాలు ఇప్పుడే తెలుసుకోండి..
Health Tips: సాధారణంగానే చాలా మంది తమ ఇంటి వంటకాల్లో పచ్చి బఠానీలను వినియోగిస్తుంటారు. వాటి కూర కూడా వండుకుంటారు.
Health Tips: సాధారణంగానే చాలా మంది తమ ఇంటి వంటకాల్లో పచ్చి బఠానీలను వినియోగిస్తుంటారు. వాటి కూర కూడా వండుకుంటారు. అయితే, పచ్చి బఠానీలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా హృదయ సంబంధిత వ్యాధులను నివారించడంలో అద్భుత పాత్ర పోషిస్తుందంటున్నారు. పచ్చి బఠానీల్లో ఫ్లెవనాయిడ్స్, కెరోటినాయిడ్స్, పాలీఫినోల్స్, విటమిన్ ఏ, సి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సహా మరికొన్ని పోషకాలు ఉన్నాయి. బరువు తగ్గడంలో, బ్లడ్‌లో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్ చేయడంలో అద్భుతంగా పని చేస్తుంది. అంతేకాదు.. పచ్చి బఠానీల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షిస్తుంది.
పచ్చి బఠానీలతో ప్రయోజనాలు.. 1. బరువు తగ్గిస్తుంది 2. ఆర్థరైటిస్, గుండె వ్యాధులు, ఓస్టిపోరియోసిన్ వంటి వ్యాధులను సోకకుండా ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. 3. పచ్చిబఠానీల్లో అధిక శాతం ఫైబర్ కలిగి ఉండి మలబద్దకం సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియను పెంచుతుంది. 4. బ్లడ్ షుగర్‌ను సరిచేస్తుంది. ఇది డయాబెటిక్ పేషెంట్స్ దివ్యఔషధం వంటిది. 5. స్టమక్ క్యాన్సర్ నివారిస్తుంది 6. వ్యాధినిరోధకతను పెంచుతుంది. 7. గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. 8. ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా దోహదపడుతుంది. 10. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పని చేస్తుంది.
గమనిక: ప్రజల సాధారణ ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని.. ఆరోగ్య నిపుణులు తెలిపిన సమాచారం ప్రకారం ఈ వివరాలను పబ్లిష్ చేయడం జరిగింది. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలుంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Also read:
Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!
Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!
Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..