Golgappa Shake: ద్వేవుడా.. ఇదేం షేక్‌రా నాయనా.. చూస్తుంటేనే బుర్ర తిరుగుతోంది..! పానీపూరీతో షేక్.. వీడియో
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రకరకాల వినూత్న వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో రకరకాల వినూత్న వంటకాలు వైరల్ అవుతున్నాయి. ఈ వింత వంటలు చూసి ఆహార ప్రియులే వామ్మో అంటూ నోరెళ్లబెడుతున్నారు. చాక్లెట్ సమోసా.. టమోటా కచోరి, ఐస్ క్రీం కచోరి, ఇలా ఒక్కటేమిటీ.. ఎన్నో వంటకాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో మరో సరికొత్త వంటకం నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇది చూసి ‘పానీపూరీ’ ప్రియులు వామ్మో ఇదేంటిరా నాయనా..? అంటూ తలబాదుకుంటున్నారు. ఆ విచిత్ర వంటకం ఏంటంటే.. ‘గోల్గప్పా షేక్’. ఇది చూస్తే తయారు చేయడం చాలా ఈజీ. ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు. రుచి ఎలా ఉంటుందనేది ట్రై చేస్తేనే తెలుస్తుంది. కానీ.. ఈ విచిత్ర షేక్ చూసి వాంతులు అవుతున్నాయంటూ నెటిజన్లు ఇంటర్నెట్ వేదికగా దుమ్మెత్తి పోస్తున్నారు. దీనిని చూసి నెటిజన్లు ఇదేం పోయే కాలం రా..? నాయనా.. ఇలా చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు.వైరల్ అవుతున్న ఈ క్లిప్‌లో ఓ వ్యక్తి ‘గోల్గప్ప షేక్’ తయారు చేస్తున్నాడు. మొదట అతను మిక్సర్‌లో రెండు గొల్గప్పలను వేసాడు. తరువాత కొన్ని ఉడికించిన బంగాళాదుంపలు, రెడ్ చట్నీ, పుల్లని నీరు కలిపాడు. దీని తరువాత కొద్దిగా ఐస్ జోడించి.. మిక్సర్ ఆన్ చేసాడు. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాసులో పోసి.. గొల్గప్ప పొడిని వేసాడు. ఆ తర్వాత ఉడికించిన బంగాళాదుంపలతో అలంకరించాడు. ఈ వీడియోను ఓ ఫుడ్ బ్లాగర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. దీనిని ఇప్పటివరకు వేలాది మంది వీక్షించి పలు కామెంట్లు చేస్తున్నారు. ఇది చూస్తేనే వాంతులు వస్తున్నాయంటూ పేర్కొంటున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
ఆటోడ్రైవర్‌తో మహిళల ఫైట్.. నడిరోడ్డుపై జుట్టుపట్టి వీరంగం
పొలానికి వెళ్లిన రైతు.. దూరంగా కనిపించినది చూసి హడలిపోయి..
విషపూరిత పాములను చంపేందుకు తెచ్చిన ముంగీసల కథ..
ఇక ఇంటర్నెట్ లేకపోయినా ఫోన్లోనే లైవ్ టీవీ చూడొచ్చు!
ఏనుగునైనా చంపే కింగ్ కోబ్రా.. తన పిల్లల కోసం ఏం చేసిందో తెలుసా
మొక్కలకు నీళ్లు పోస్తున్న వ్యక్తి.. వెనుక ఏదో అలికిడి.. చూడగా
సినిమాకి వెళ్తే 22 నిమిషాలు యాడ్స్ వేస్తారా..?

