AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Interesting Facts: ఇంట్లో ప్రశాంతంగా ఉండాలా.. అయితే ఈ కలర్స్ పెయింటింగ్ వేయండి..

ఉదయం లేచింది మొదలు.. ఉద్యోగానికి, స్కూళ్లకు ఉరుకులు పరుగులు పెడతారు. సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు. ఇల్లు అందంగా ఉంటేనే మనసు కూడా హాయిగా ఉంటుంది. వీరు ఇంటికి వేసుకునే రంగులతోనే.. మీ మనసు కూడా ముడిపడి ఉంటుంది. కలర్ సైకాలజీ ప్రకారం.. ఇంటికి కొన్ని రకాల రంగులు బాగా సూట్ అవుతాయి. వాటితో మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. కలర్స్ వల్ల మీ ఆలోచనా..

Interesting Facts: ఇంట్లో ప్రశాంతంగా ఉండాలా.. అయితే ఈ కలర్స్ పెయింటింగ్ వేయండి..
Interesting Facts
Chinni Enni
|

Updated on: Mar 20, 2024 | 1:23 PM

Share

ఉదయం లేచింది మొదలు.. ఉద్యోగానికి, స్కూళ్లకు ఉరుకులు పరుగులు పెడతారు. సాయంత్రం ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే ప్రశాంతంగా ఉండాలి అనుకుంటారు. ఇల్లు అందంగా ఉంటేనే మనసు కూడా హాయిగా ఉంటుంది. వీరు ఇంటికి వేసుకునే రంగులతోనే.. మీ మనసు కూడా ముడిపడి ఉంటుంది. కలర్ సైకాలజీ ప్రకారం.. ఇంటికి కొన్ని రకాల రంగులు బాగా సూట్ అవుతాయి. వాటితో మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. కలర్స్ వల్ల మీ ఆలోచనా విధానం కూడా మారిపోతుంది. మీరు మీ ఇంటికి వేసే కలర్స్ విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టండి. మిమ్మల్ని ప్రశాంతంగా, ఆనందంగా ఉంచే రంగుల్ని సెలక్ట్ చేసుకుంటే.. చాలా మంచిది. మరి ఎలాంటి రంగులు ఎంచుకోవాలో చూద్దాం.

నీలం:

బ్లూ కలర్ అనేది మీ మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. ఇది శరీరంలోని నరాలను కూడా ప్రశాంత పరుస్తుంది. అలాగే మనసును రీఫ్రెష్ చేస్తుంది. నేవీ బ్లూ, బ్లూ షేడ్స్ ని ఎంచుకోవచ్చు.

ఆకుపచ్చ:

అలాగే ఆకు పచ్చ రంగు కూడా ప్రకృతితో ముడి పడి ఉంటుంది. ఆకు పచ్చలో అనేక రకాలు షేడ్స్ ఉన్నాయి. వీటిల్లో ఏది అయినా ఇంటికి చాలా మంచిది. ఇవి ఇంట్లో విశ్రాంతి వాతావరణాన్ని ఇస్తాయి. అంతే కాకుండా ఇవి మీ ఇంటికి గొప్ప తనాన్ని కూడా ఇస్తాయి.

ఇవి కూడా చదవండి

ఊదా రంగు:

ఊదా రంగు అనేది ఆధ్యాత్మికత, లగ్జరీ, సృజనాత్మకతను సూచిస్తుంది. మీలో తెలియని ప్రశాంతతను కలిగిస్తాయి. లావెండర్ రంగు కూడా ఇంటికి మంచి అందాన్ని తీసుకురావడమే కాకుండా.. మీ మనసు హాయిగా ఉండేలా చేస్తుంది.

బ్రౌన్ అండ్ గ్రే కలర్స్:

బ్రౌన్ అండ్ గ్రే కూడా మీలో సామరస్య భావాన్ని ఇస్తాయి. మీ ఇంటిలోని వాతావరణాన్ని కూడా ప్రశాంతంగా ఉండేలా చేస్తాయి.

పసుపు – నారింజ:

ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్స్ మిమ్మల్ని సంతోషంగా ఉండేలా చేస్తాయి. అంతే కాకుండా ఇంటికి ప్రకాశవంతమైన రూపాన్ని తీసుకువస్తాయి. ఇంటికి మంచి నిండుదనం కూడా ఇస్తాయి.

బెడ్ రూమ్‌లో..

బెడ్ రూమ్‌లో నీలం, లావెండర్, ఆకు పచ్చ రంగులు ఉండేలా చూసుకోండి. ఇవి మీకు విశ్రాంతిని, మంచి నిద్రను, ప్రశాంతతను ఇస్తాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?