Swelling in Feet: తరచూ పాదాల్లో వాపులు కనిపిస్తున్నాయా.. ఈ విషయాలు మీ కోసమే!

చాలా మందిని వేధించే సమస్యల్లో పాదాల వాపు సమస్య కూడా ఒకటి. దీన్నే వైద్య భాషలో పెరిఫెరల్ ఎడెమా అని కూడా అంటారు. పాదాల్లో వాపులకు చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సార్లు ఈ సమస్య దానం తట అదే తగ్గిపోతుంది. అయితే కొన్ని సార్లు మాత్రం అస్సలు తగ్గదు. ఈ సమస్యను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చొన్నా.. నిలుచున్నా ఈ సమస్య వస్తుంది. వాపు వచ్చి ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోతే..

Swelling in Feet: తరచూ పాదాల్లో వాపులు కనిపిస్తున్నాయా.. ఈ విషయాలు మీ కోసమే!
Swelling In Feet
Follow us

|

Updated on: Jul 09, 2024 | 2:03 PM

చాలా మందిని వేధించే సమస్యల్లో పాదాల వాపు సమస్య కూడా ఒకటి. దీన్నే వైద్య భాషలో పెరిఫెరల్ ఎడెమా అని కూడా అంటారు. పాదాల్లో వాపులకు చాలా కారణాలు ఉంటాయి. కొన్ని సార్లు ఈ సమస్య దానం తట అదే తగ్గిపోతుంది. అయితే కొన్ని సార్లు మాత్రం అస్సలు తగ్గదు. ఈ సమస్యను చాలా మంది నిర్లక్ష్యం చేస్తారు. కానీ అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు కూర్చొన్నా.. నిలుచున్నా ఈ సమస్య వస్తుంది. వాపు వచ్చి ఒకటి, రెండు రోజుల్లో తగ్గిపోతే పర్వాలేదు. కానీ ఎక్కువ రోజులు ఉంటే మాత్రం ఖచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాలి. శరీరంలో ఉండే వివిధ అనారోగ్య సమస్యల వల్ల పాదాల్లో వాపు అనేది కనిపిస్తుంది. మరి ఎలాంటి సమస్యలు ఉంటే పాదాల్లో వాపు వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పాదాల్లో వాపుకు కారణాలు:

1. మూత్ర పిండాలు, కాలేయ సంబంధిత సమస్యలు ఉంటే పాదాల్లో వాపులు వస్తాయి. సిరలకు సంబంధించిన సమస్యలు, గుండె సంబంధిత సమస్యల కారణంగా కూడా పాదాల్లో వాపు వస్తుంది.

2. పాదాల్లో వాపుతో పాటు నొప్పి ఎక్కువగా ఉండటం, అసౌకర్యంగా అనిపించడం, ఎర్రగా ఉండటం వల్ల కూడా ఈ నొప్పులు అనేవి స్థాయి. పాదాల్లో ఇన్ ఫెక్షన్, ఇన్ ప్లామేషన్ కారణంగా కూడా ఇలా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

3. హార్మోన్లలో మార్పు, బరువు ఒక్కసారిగా పెరగడం వంటి కారణాల వల్ల కూడా పాదాల్లో వాపు అనేది వస్తుంది. అదే విధంగా చాల మండలంలో గాయాలు ఉన్నా పాదాల్లో వాపు ఉంటుంది.

4. పాదాల్లో వాపుతో పాటు జ్వరం, ఎరుపుగా ఉండటం, పాదాల్లో వెచ్చగా ఉండటం, ఆవిరి రావడం వంటి లక్షణాలు ఉంటే.. ఇది సెల్యులైటిస్‌కు కారణం అవ్వొచ్చు. ఇలాంటి సందర్భాల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

5. పాదాల్లో ఎక్కు రోజులు వాపు ఉండటం, సిరల్లో గడ్డ కట్టడం, కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నా ఇలా పాదాల్లో వాపు వస్తుంది.

6. పలు గాయాల కారణంగా, శరీర బరువు పాదాలపై పడటం వల్ల కూడా పాదాల్లో వాపులు రావడం సహజం. కానీ ఎక్కువ రోజులు వాపు ఉంటే వైద్యుల్ని సంప్రదించాలి.

వాపులు తగ్గాలంటే.. రాత్రి పూట పడుకునే ముందు గోరు వెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి అందులో పాదాలను 20 నిమిషాలు ఉంచాలి. ఇలా చేస్తే వాపు తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..