Fruits at Night: రాత్రి పూట ఈ పండ్లు తింటే ఏం జరుగుతుందో తెలుసా..
పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా చాలా మంది వీటిని పట్టించుకోరు. ఏదో తింటున్నాం.. కడుపు నిండుతుంది అనుకుంటారు. కేవలం అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే పండ్లు అనేవి గుర్తొస్తాయి. అలాగే పండ్లు తినడానికి కూడా సరైన సమయం అంటూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. అంతే కాకుండా కొన్ని రకాల పండ్లు రాత్రి సమయాల్లో..

పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ విషయం అందరికీ తెలుసు. అయినా చాలా మంది వీటిని పట్టించుకోరు. ఏదో తింటున్నాం.. కడుపు నిండుతుంది అనుకుంటారు. కేవలం అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే పండ్లు అనేవి గుర్తొస్తాయి. అలాగే పండ్లు తినడానికి కూడా సరైన సమయం అంటూ ఉంటుంది. ఎప్పుడు పడితే అప్పుడు తినకూడదు. అంతే కాకుండా కొన్ని రకాల పండ్లు రాత్రి సమయాల్లో అస్సలు తినకూడదు. దీని వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు, అనారోగ్య సమస్యలు రావచ్చొని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఎలాంటి పండ్లు రాత్రి పూట తినకూడదో.. తింటే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
అరటి పండు:
అరటి పండు తినడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ చిన్న పిల్లలకు ఒక అరటి పండు ఇవ్వడం వల్ల వారు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. ఈ పండు తింటే తక్షణమే ఎనర్జీ అందుతుంది. అంతే కాకుండా ఆరోగ్యంగా బరువు పెరుగుతారు. అయితే రాత్రి పూట ఈ పండు తింటే.. రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్ష:
ద్రాక్ష పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. వీటిల్లో ఎక్కువగా విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభ్యమవుతాయి. ద్రాక్ష తీసుకోవడం వల్ల గుండెకు ఎంతో మంచిది. చర్మ సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి. అయితే ఈ ద్రాక్ష పండ్లను కూడా నైట్ తీసుకోకూడదట. ఎందుకంటే ఇవి తింటే రక్తంలో.. చక్కెర స్థాయిలు పెరుగుతాయి. కాబట్టి దూరంగా ఉండండి.
పైనాపిల్:
పైనాపిల్ కూడా రాత్రి పూట తీసుకోకుండా ఉండటం చాలా మంచిది. వీటిల్లో కూడా పోషకాలు అనేవి మెండుగా ఉంటాయి. విటమిన్ సి కూడా లభ్యమవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని సైతం పెంచుతుంది. కానీ రాత్రి పూట తీసుకోకూడదట. దీని వల్ల అరుగుదల సమస్యలు, షుగర్ లెవల్స్ పెరుగుతాయి.
మామిడి పండు:
మామిడి పండు కూడా రాత్రి పూట తినకూడదు. మామిడి పండులో కూడా శరీరానికి మేలు చేసే పోషకాలు చాలా ఉంటాయి. కానీ రాత్రి పూట తింటే జీర్ణ సంబంధిత సమస్యలు, చక్కెర లెవల్స్ అనేవి పెరుగుతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








