- Telugu News Photo Gallery Here's how to lower BP without taking tablets, check here is details in Telugu
Lower Blood Pressure: ట్యాబ్లెట్స్ వేసుకోకుండా బీపీని తగ్గించాలంటే ఇలా చేయండి..
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో బీపీ కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధ పడుతున్నారు. కాబట్టి మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా బీపీ తగ్గించుకోవాలంటే.. ఇలా చేయక తప్పదు. బీపీని కంట్రోల్ చేయాలంటే వైద్యుని సలహా కూడా చాలా అవసరం. హై బ్లడ్ ప్రెజర్‌తో బాధ పడేవారు ముందుగా ఉప్పును తగ్గించాలి. అంతేకాకుండా సోడియం ఉన్న ఎలాంటి ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకోకూడదు. అప్పుడే బీపీ కంట్రోల్..
Updated on: Jun 25, 2024 | 6:30 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది ఇబ్బంది పడే సమస్యల్లో బీపీ కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్యతో బాధ పడుతున్నారు. కాబట్టి మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకుండా బీపీ తగ్గించుకోవాలంటే.. ఇలా చేయక తప్పదు. బీపీని కంట్రోల్ చేయాలంటే వైద్యుని సలహా కూడా చాలా అవసరం.

రక్తపోటును కొలవడానికి కనీసం 30 నిమిషాల ముందు ఏమీ తినకూడదు. మద్యం సేవించకూడదు. పొగ త్రాగకూడదు. ఇది రక్తపోటులో ఆకస్మిక పెరుగుదలకు కారణమవుతుంది. అదేవిధంగా, వ్యాయామం చేసిన వెంటనే రక్తపోటును తనిఖీ చేయకూడదు. ఈ సమయంలో ఒత్తిడి అకస్మాత్తుగా పెరుగుతుంది. ఇలా చేస్తే సరైన బీపీ కొలతలు నమోదు చేయడం కష్టం అవుతుంది.

బీపీ తగ్గాలి అనుకునేవారు పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవం చాలా ముఖ్యం. వీటి వలన రక్త పోటు అనేది నియంత్రణలోకి వస్తుంది. అయితే సోడియం కంటెంట్ ఉండే పండ్లు, కూరగాయలు తీసుకోకండి.

అధిక రక్త పోటును తగ్గించుకోవాలి అనుకుంటే పోటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం ముఖ్యం. కాబట్టి అరటి పండ్లు, అవొకాడో, బచ్చలి కూర, నారింజ వంటివి తీసుకోవచ్చు. అదే విధంగా నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.

బీపీ కంట్రోల్‌లో ఉండాలి అనుకుంటే.. మీ బరువును కూడా అదుపులో ఉంచుకోవాలి. అధిక బరువు ఉన్నవారికి బీపీ, షుగర్ లెవల్స్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మీ వెయిట్‌ని కూడా అదుపులో ఉంచుకోవాలి.




