Hight Protein Foods: గుడ్డులో కంటే ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ ఇవే.. డోంట్ మిస్!
ఆకలి వేసిందని ఏదో తింటున్నామంటే తింటారు చాలా మంది. కానీ కొంత మంది అలా కాదు. వాళ్లు ఏం తింటున్నారు? అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలా చాలా మంది జిమ్ వర్క్ అవుట్స్‌కి వెళ్లే వాళ్లకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. అలాంటి వారు బయట మార్కెట్లో లభించే కెమికల్స్ పౌడర్స్ యూజ్ చేయడం కంటే.. ఇలా నేచురల్ ఫుడ్ తీసుకుంటే హెల్త్ చాలా మంచిది. ప్రోటీన్ అనగానే చాలా మందికి గుడ్డు..

ఆకలి వేసిందని ఏదో తింటున్నామంటే తింటారు చాలా మంది. కానీ కొంత మంది అలా కాదు. వాళ్లు ఏం తింటున్నారు? అందులో ఎలాంటి పోషకాలు ఉన్నాయని లెక్కలు వేసుకుంటూ ఉంటారు. ఇలా చాలా మంది జిమ్ వర్క్ అవుట్స్‌కి వెళ్లే వాళ్లకు ప్రోటీన్ అనేది చాలా అవసరం. అలాంటి వారు బయట మార్కెట్లో లభించే కెమికల్స్ పౌడర్స్ యూజ్ చేయడం కంటే.. ఇలా నేచురల్ ఫుడ్ తీసుకుంటే హెల్త్ చాలా మంచిది. ప్రోటీన్ అనగానే చాలా మందికి గుడ్డు గుర్తొచ్చేస్తుంది. కానీ కోడి గుడ్డులో కంటే ఈ పదార్థాల్లో ఇంకా ఎక్కువగా ప్రోటీన్ అనేది లభస్తుంది. ఇప్పుడు చెప్పే ఈ మూడు గింజల్లో హై ప్రోటీన్ ఉంటుంది. అంతే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవి ఎక్కువగా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తాయి. మరి ఆ ఫుడ్స్ ఏంటి? ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీలు:
పల్లీలను చాలా మంది తక్కువ అంచనా వేస్తారు. కేవలం చట్నీలకు మాత్రమే ఉపయోగిస్తారు. కానీ వీటిల్లో ప్రోటీన్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది. ఇవి ఈజీగా ఎక్కడైనా లభిస్తాయి. వీటిల్లో ఎక్కువగా శాతం ఖనిజాలు అనేవి ఉంటాయి. ఒక ఔన్స్ పల్లీలో రెండు గ్రాముల ప్రోటీన్ లభిస్తుంది. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచేందుకు చాలా హెల్ప్ చేస్తుంది. వీటిని నేరుగా, నానపెట్టుకుని, ఉడికించుకుని ఇలా ఎలాగైనా తినవచ్చు.
బాదం పప్పు:
బాదం పప్పులో కూడా చాలా హై ప్రోటీన్ ఉంటుంది. బాదం పప్పును పోషకాల హౌస్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇవి శరీరానికి కావాల్సిన ఖనిజాలను అందిస్తుంది. అంతే కాదు బాదం పప్పు తినడం వల్ల గుండె కూడా చాలా మంచిది. బాదం పప్పును నేరుగా తినడం కంటే నానపెట్టుకుని తింటే చాలా మంచిది. ప్రోటీన్ అవసరం ఉన్నవారు వీటిని తీసుకోవడం బెటర్. ఇతర పోషకాలు కూడా అందుతాయి.
పిస్తా పప్పు:
అధికంగా ప్రోటీన్ లభించే వాటిల్లో పిస్తా పప్పు కూడా ఒకటి. ఇందులో కూడా పోషకాలు అనేవి పుష్కలంగా లభిస్తాయి. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనాలే ఉన్నాయి. రక్త ప్రసరణ అనేది మెరుగు పడుతుంది. రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. కండరాల అభివృద్ధికి కూడా మంచిది. ఇలా ఒక్కటేంటి చాలా బెనిఫిట్సే ఉన్నాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)








