వామ్మో.. మహిళలు తమ జీవితంలో ఎన్ని కిలోల లిప్‌స్టిక్ తింటారో తెలిస్తే షాకే..
లిప్ స్టిక్ అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచుతుంది. కానీ తినేటప్పుడు, తాగేటప్పుడు లిప్ స్టిక్ కడుపులోకి వెళుతుంది. ఒక మహిళ తన జీవితకాలంలో ఎంత లిప్‌స్టిక్‌ను తింటుందో తెలిస్తే మీరు షాక్ అవడం గ్యారెంటీ.. ఆ వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

లిప్‌స్టిక్ అనేది ప్రతి మహిళ మేకప్‌లో చాలా ముఖ్యమైన భాగం. కార్పొరేట్ ఉద్యోగుల నుంచి హౌస్ వైఫ్స్ వరకు లిప్‌స్టిక్‌ను ఎక్కువగా వాడతారు. పెద్దగా మేకప్ లేకపోయినా.. ఒక్క లిప్‌స్టిక్ వేసుకుంటే చాలు, లుక్ మారిపోతుంది. లిప్‌స్టిక్ తయారీలో వాడే రసాయనాలు ఆరోగ్యానికి హానికరమనే చర్చ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అయితే లిప్‌స్టిక్ వాడే మహిళలు తెలియకుండానే దాన్ని తింటున్నారని మీకు తెలుసా..? ఒక మహిళ తన జీవితకాలంలో మొత్తం ఎన్ని కిలోల లిప్‌స్టిక్‌ను తింటుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
వరల్డ్ ఆఫ్ స్టాటిక్స్ నివేదిక ప్రకారం..
రోజూ లిప్‌స్టిక్ వాడే ఒక మహిళ తన మొత్తం జీవితకాలంలో సుమారు 1.8 కిలోల నుంచి 4 కిలోల లిప్‌స్టిక్‌ను మింగేస్తుందని వరల్డ్ ఆఫ్ స్టాటిక్స్ అనే సంస్థ రిపోర్ట్ చేసింది. చాలా మంది అనుకు కొన్ని గ్రాముల కంటే ఇది చాలా ఎక్కువ!
లిప్‌స్టిక్‌లో ఉండే హానికర రసాయనాలు
లిప్‌స్టిక్ వేసుకునే వారికి ఇది ఆందోళన కలిగించే విషయం. ఎందుకంటే అనేక అధ్యయనాలు లిప్‌స్టిక్‌లో మన ఆరోగ్యానికి హాని చేసే కొన్ని రసాయనాలు ఉంటాయని తేల్చాయి.
ప్రమాదకర పదార్థాలు: లిప్‌స్టిక్‌లో సీసం, కాడ్మియం, పారాబెన్‌లు, థాలేట్‌లు, పెట్రోలియం, కృత్రిమ రంగులు, ట్రైక్లోసన్ వంటి హానికర రసాయనాలు ఉండే అవకాశం ఉంది.
హార్మోన్ల సమస్యలు: ముఖ్యంగా పారాబెన్‌లు శరీరంలోని హార్మోన్ల వ్యవస్థపై ప్రభావం చూపి, ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఏది కొనాలి..? ఏం చేయాలి..?
అందుకే లిప్‌స్టిక్ కొనేటప్పుడు దాని తయారీలో వాడిన పదార్థాలపై దృష్టి పెట్టడం ముఖ్యం.
పారాబెన్ ఫ్రీ : ఏదైనా బ్యూటీ ప్రొడక్ట్ కొనేటప్పుడు అది తప్పనిసరిగా పారాబెన్ రహితం అయితేనే కొనాలి.
సహజ నూనెలు: లిప్‌స్టిక్‌లో సహజ నూనెలు, విటమిన్ ఇ లేదా ఇతర ఆరోగ్యకరమైన మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
అలెర్జీ వస్తే మానేయాలి: లిప్‌స్టిక్ వాడినప్పుడు పెదవులు పొడిబారడం, అలెర్జీ వంటి సమస్యలు వస్తే వెంటనే ఆ ఉత్పత్తిని వాడటం మానేసి, చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి.
మృదువైన పెదవుల కోసం
పెదవుల చర్మం సున్నితంగా ఉంటుంది. వాటికి నూనె గ్రంథులు ఉండవు కాబట్టి అవి త్వరగా పొడిబారి, నల్లబడతాయి. అందుకే రోజూ రాత్రి లిప్‌స్టిక్‌ను శుభ్రం చేశాక మాయిశ్చరైజర్ లేదా లిప్ బామ్‌తో తేమగా ఉంచాలి. అలాగే వారానికి ఒకసారి సున్నితమైన స్క్రబ్‌తో పెదవులపై ఉన్న చనిపోయిన చర్మాన్ని తొలగించడం మంచిది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




