నిరంతరం, అలసట బలహీనతనా? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే!
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు కాని ప్రస్తుతం చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా నిరంతరం, అలసట, నీరం, బలహీనత వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు. అలాంటి వారికే ఈ అద్భుతమైన సమాచారం. ఎవరికైతే విటమిన్ బి 12 లోపం ఉంటుందో, వారు అనారోగ్యసమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇలా విటమిన్ బి 12 లోపం ఉన్న వారు ఆరోగ్యం కోసం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలో చూద్దాం.
Updated on: Oct 28, 2025 | 9:32 AM

శరీరానికి విటమిన్ బి12 అనేది చాలా అవసరం. ఇది శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా,శరీరానికి కావాల్సిన పోషకాలను అదిస్తుంది. అందువలన తప్పకుండా శరీరానికి సరిపడ విటమిన్ బి12 ఉండాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు. ఒక వేళ శరీరంలో విటమిన్ బి12 లోపించినట్లు అయితే రక్తహీనత, అలసట, బలహీనత, నరాల సంబంధిత సమస్యలు వంటివి వస్తుంటాయి, కాగా, అసలు విటమిన్ బి12 కోసం ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

మాంసం, చేపలు : ప్రతి రోజూ లేదా వారంలో రెండు సార్లైనా చేపలు, గుడ్లు వంటి మాంసాహారాలు తీసుకోవాలి. ఇందులో విటమిన్ బి12 పుష్కలంగా ఉంటుంది. అందువలన తప్పకుండా వారంలో ఒక్కసారైనా ఇవి తీసుకోవాలంట. దీని వలన శరీరంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెరగడమే కాకుండా, నాడీ వ్యవస్థ పని తీరు కూడా మెరుగుపడుతుంది.

పాలు పెరుగు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ బి12, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. అందువలన ప్రతి రోజూ వీటిని తీసుకోవడం వలన శరీరంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరగడమే కాకుండా, ఇది నాడీ వ్యవస్థ పనితీరును ప్రోత్సహిస్తుంది.

పాల కూర రక్తహీనతను తగ్గించడంలో కీలక పాత్రపోషిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. అందువలన ఎవరైతే విటమిన్ బి12, రక్త హీనతతో బాధపడుతున్నారో, అలాంటి వారు పాల కూరను తమ ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ఇందులో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరానికి మేలు చేస్తుంది.

సోయాబీన్ కర్రీ లేదా సోయా పాలు వంటి ఆహారాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని మీరు ప్రతి రోజూ తీసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.



