AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Snoring Problem: గురక రాకుండా ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. ఇలా చేయండి..

ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే సమస్యల్లో గురక కూడా ఒకటి. గురక కారణంగా పక్కన ఉన్నవారికి నిద్ర అనేది అస్సలు పట్టదు. పక్కన ఉన్నవారు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. గురక రావడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. గురక ఎక్కువగా వస్తూ ఉంటే.. నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. నోరు లేదా ముక్కు ద్వారా గాలి తీసుకునేటప్పుడు అడ్డంకులు ఏర్పడినప్పుడు.. నోటి ద్వారా గాలి తీసుకునే క్రమంలో గురక వస్తుంది. ఈ గురక వల్ల ప్రాణానికి కూడా..

Snoring Problem: గురక రాకుండా ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. ఇలా చేయండి..
Snoring Problem
Chinni Enni
|

Updated on: Oct 02, 2024 | 2:15 PM

Share

ప్రస్తుత కాలంలో చాలా మందిని వేధించే సమస్యల్లో గురక కూడా ఒకటి. గురక కారణంగా పక్కన ఉన్నవారికి నిద్ర అనేది అస్సలు పట్టదు. పక్కన ఉన్నవారు కూడా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. గురక రావడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. గురక ఎక్కువగా వస్తూ ఉంటే.. నిద్రలేమి సమస్య ఏర్పడుతుంది. నోరు లేదా ముక్కు ద్వారా గాలి తీసుకునేటప్పుడు అడ్డంకులు ఏర్పడినప్పుడు.. నోటి ద్వారా గాలి తీసుకునే క్రమంలో గురక వస్తుంది. ఈ గురక వల్ల ప్రాణానికి కూడా ప్రమాదకరంగా మారుతుంది. గురక ఎక్కువగా వస్తూ ఉంటే.. ఇతర అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి ఇలాంటి గురకను ముందుగానే నియంత్రించుకోవాలి. మరి ఇంటి చిట్కాలతోనే గురకను ఎలా తగ్గించకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బరువు:

అధిక బరువుతో బాధ పడేవారిలో గురక అనేది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మెడ చుట్టూ కొవ్వు అనేది పేరుకుపోతుంది. దీని వల్ల వాయు మార్గాల్లో అడ్డంకులు ఏర్పడి గురక వస్తుంది. కాబట్టి బరువును అదుపులో ఉంచుకోవాలి. అదే విధంగా కొలెస్ట్రాల్ లేకుండా చేసుకోవాలి.

సరైన దిశలో పడుకోవాలి:

పడుకునే పొజిషన్ బట్టి కూడా గురక వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నిటారుగా కాకుండా పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. ఎక్కువగా ఎడమ వైపు తిరిగి పడుకుంటే మంచిది. దీని వల్ల వాయు మార్గాలు ఫ్రీగా ఉండి.. గాలి ప్రవాహం సులువగా జరుగుతుంది. గుండె మీద కూడా ఒత్తిడి పడదు.

ఇవి కూడా చదవండి

తల ఎత్తుగా ఉండాలి:

నిద్రించే సమయంలో తల పైకి ఎత్తుగా ఉండేలా తలగడ ఏర్పాటు చేసుకోవాలి. తల కిందుకు ఉంటే శ్వాస తీసుకునే క్రమంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి తల ఎత్తుగా ఉంటే వాయు మార్గం తెరచుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల గురక ఆగుతుంది.

నీటిని తీసుకోవాలి:

శరీరం డీహైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా గురక సమస్య వస్తుంది. నీళ్లు ఎక్కువగా తీసుకోకపోతే.. గొంతు భాగంలో శ్లేష్మం ఉండి.. గాలి తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి పగలు నీటిని ఎక్కువగా తీసుకోవాలి.

మద్యం సేవించడం మానేయండి:

మద్యం సేవించిన వారిలో కూడా గురక సమస్య ఏర్పడుతుంది. ఆల్కహాల్ గొంతులోని కండరాలను సంకోచించేలా చేస్తుంది. దీని వల్ల గాలి అనేది సరిగా ఆడదు. కాబట్టి నోటితో తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గురక వస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం