Kitchen Hacks: పచ్చళ్లకు బూజు పట్టకుండా.. రుచి పెరగాలంటే.. ఈ టిప్స్ బెస్ట్!

తెలుగు వారు అంటే ముందుగా గుర్తొచ్చేవి వాళ్లు చేసే వంటలు. అందులోనూ పచ్చళ్లకు పెట్టింది పేరు. తెలంగాణాలో అయినా ఆంధ్రాలో అయినా పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చేసే విధానం వేరు కావచ్చు.. కానీ రుచి మాత్రం ఒకేలా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలి పెట్టరు. ముఖ్యంగా గోదారోళ్లు పెట్టే పచ్చళ్లకు.. విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే..

Kitchen Hacks: పచ్చళ్లకు బూజు పట్టకుండా.. రుచి పెరగాలంటే.. ఈ టిప్స్ బెస్ట్!
Kitchen Hacks
Follow us
Chinni Enni

|

Updated on: Oct 02, 2024 | 1:58 PM

తెలుగు వారు అంటే ముందుగా గుర్తొచ్చేవి వాళ్లు చేసే వంటలు. అందులోనూ పచ్చళ్లకు పెట్టింది పేరు. తెలంగాణాలో అయినా ఆంధ్రాలో అయినా పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. చేసే విధానం వేరు కావచ్చు.. కానీ రుచి మాత్రం ఒకేలా ఉంటాయి. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలి పెట్టరు. ముఖ్యంగా గోదారోళ్లు పెట్టే పచ్చళ్లకు.. విదేశాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. వేడి వేడి అన్నంలోకి కొద్దిగా పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే.. ఈ జన్మకు ఇంకేం అవసరం లేదు అనిపిస్తుంది. అంత కమ్మగా ఉంటాయి. అయితే ఈ పచ్చళ్లను ఎక్కువగా వేసవి కాలంలోనే పెడుతూ ఉంటారు. ఈ టైమ్‌లోనే మసాలాలు అన్నీ లభ్యమవుతాయి. అయితే వర్షా కాలం వచ్చేసరికి.. పచ్చళ్లకు బూజు పట్టేస్తుంది. పచ్చళ్ల మీద తెల్లగా, నల్లగా ఫంగస్ ఏర్పుడతుంది. వాసన, రుచి కూడా మారిపోతాయి. దీంతో కొంత మంది పచ్చళ్లను పడేయటం లేదంటే పక్కకు పెట్టడం చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పే చిట్కాలు ట్రై చేశారంటే.. పచ్చళ్లు అస్సలు పాడవ్వవు.

సరైన డబ్బాలు అవసరం:

పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే సరైన డబ్బాలు కావాలి.  కాస్త ఖాళీగా ఉన్నవి, గాలి చొరబడని డబ్బాలు ఎంచుకోవాలి. పూర్వం ఎక్కువగా పింగాణీ జాడీలు, గాజు సీసాలను వాడేవారు. గాజువి అయితే పచ్చళ్లకు బెస్ట్ అని చెప్పొచ్చు. ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచితే.. రంగు, వాసన, రుచి తగ్గిపోతాయి. కానీ చాలా మంది ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రమే నిల్వ ఉంచుతాయి. అలాగే డబ్బాల్లో పచ్చళ్లు వేసే ముందు.. ఎండలో పెట్టడం బెటర్.

ఆయిల్:

పచ్చళ్లకు ఆయిల్ అనేది ఎక్కువగా కావాలి. నూనె తక్కువగా ఉంటే.. బూజు పట్టి ఆరిపయి.. రుచి తగ్గిపోతుంది. పచ్చళ్లు రుచిగా ఉండటానికి కారణం నూనె. కాబట్టి నూనె తక్కువ కాకుండా చూసుకోండి. నూనె ఎక్కువగా ఉంటే ఫంగస్ వంటివి రాకుండా చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ఉప్పు:

పచ్చళ్లలో ఉప్పు కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పచ్చళ్లు ఎక్కువ కాలం నిల్వ ఉండి, రుచిగా ఉండాలంటే అందుకు ఉప్పు చాలా అవసరం. ఉప్పు బ్యాక్టీరియా, ఫంగస్ ఏర్పడకుండా చేస్తుంది. వర్షా కాలంలో ఒకసారి పచ్చళ్లలో ఉప్పు చూసుకుని కలుపుకోవడం మంచిది.

ఎండలో పెట్టండి:

వర్షా కాలంలో పచ్చళ్లకు బూజు పట్టకుండా ఉండాలంటే.. మూత తీయకుండా పచ్చడి ఉన్న డబ్బాలు, జాడీలను ఎండలో పెట్టడం చాలా మంచిది. పచ్చడి పాడవకుండా ఉండాలంటే.. చేతులను నేరుగా పచ్చడిలో ఉంచకూడదు. తడి చేతులను ముట్టు కోకూడదు. వర్షా కాలంలో రెండు సార్లు పచ్చళ్లను తిరగేస్తూ.. ఆయిల్ ఉందో లేదోచూసుకోండి. ఈ టిప్స్ పాటించడం వల్ల పచ్చళ్లు పాడవకుండా ఉంటాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కువైట్‌లో భారత కార్మికులతో మమేకమైన ప్రధాని మోదీ!
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
కోహ్లీతో పాటు స్మిత్, రూట్ కూడా రిటైర్మెంట్ ఇస్తారు:గ్రెగ్ చాపెల్
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
చలికాలంలో కూడా కరెంటు బిల్లు పెరిగిపోతుందా? ఈ ట్రిక్స్‌తో..
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
అవుట్ అయ్యినా పరవాలేదు.. ఆ విషయంలో వెనక్కి తగ్గేదేలే..!
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
ఉత్తరాఖండ్‌లో విరిగిపడిన భారీ కొండచరియలు.. అల్లకల్లోలంగా మారిన..
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
అన్‌సోల్డ్ ఆడిన మ్యాజిక్: ఐపీఎల్ వేలం మిస్.. షాక్ లో కావ్య పాపా
4గంటల దూరానికి 40 ఏళ్లు పట్టిందిః మోదీ
4గంటల దూరానికి 40 ఏళ్లు పట్టిందిః మోదీ
BCCI బ్యాంక్ బ్యాలెన్స్: జయ్ షా నేతృత్వంలో కొత్త చరిత్ర!
BCCI బ్యాంక్ బ్యాలెన్స్: జయ్ షా నేతృత్వంలో కొత్త చరిత్ర!
ఇదేం లొల్లిరా.. ఫస్ట్ నైట్ రోజున వధువు కోరికలు బిత్తరపోయిన వరుడు
ఇదేం లొల్లిరా.. ఫస్ట్ నైట్ రోజున వధువు కోరికలు బిత్తరపోయిన వరుడు
భయపెడుతోన్న బాబా వంగా జోస్యం.. 2025లో పెను యుద్ధాలు
భయపెడుతోన్న బాబా వంగా జోస్యం.. 2025లో పెను యుద్ధాలు