Motivation: ఆనందంగా ఉండాలని కోరుకోని వారుండరు? ఈ పనులతో అది మీ సొంతం
జీవితంలో చాలా మంది సంతోషాన్ని బయట వెతుకుతూ ఉంటారు. డబ్బు, ఉద్యోగం, ఇల్లు, పెళ్లి, పిల్లలు.. ఇలా ఏదో ఒక దాంతో భవిష్యత్తులో సంతోషం దొరుకుతుందని ఆశపడతారు. కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? అది బయట ఎక్కడో దూరంగా ఉండదు. అది ..

జీవితంలో చాలా మంది సంతోషాన్ని బయట వెతుకుతూ ఉంటారు. డబ్బు, ఉద్యోగం, ఇల్లు, పెళ్లి, పిల్లలు.. ఇలా ఏదో ఒక దాంతో భవిష్యత్తులో సంతోషం దొరుకుతుందని ఆశపడతారు. కానీ నిజమైన సంతోషం ఎక్కడ ఉంది? అది బయట ఎక్కడో దూరంగా ఉండదు. అది మనలోనే ఉంటుంది. ఎక్కడెక్కడో వెతికితే దొరికేది సంతోషం కాదు. మనలో ఉండేదే సంతోషం. అదే ఆనందం. ఎక్కడెక్కడో వెతకకుండానే సంతోషాన్ని కనుగొనే రహస్యాలు ఏమిటో తెలుసుకుందాం.
సంతోషం అనేది మన మనసు స్థితిని తెలియజేస్తుంది. బయటి పరిస్థితులు ఎలా ఉన్నా, మనం ఎలా ఉంటామో అదే మన సంతోషాన్ని నిర్ణయిస్తుంది. సద్గురు చెప్పినట్లు, “మీ వద్ద ఏమి ఉంది అనేది కాదు. ఈ క్షణంలో మీరు ఎలా ఉన్నారు అనేదే సంతోషం.” ప్రపంచం అంతా అద్భుతంగా జరుగుతోంది. కానీ మన మనసులో ఒక చిన్న ఆలోచన మాత్రమే మనల్ని బాధపెడుతుంది. సంతోషం భవిష్యత్తులో లేదు. ఇప్పుడు, ఈ క్షణంలోనే ఉంది.
మనలోని సంతోషాన్ని కనుగొనడానికి వెతకాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడూ మనతోనే ఉంది. మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడు, సానుకూల దృక్కోణం ఉన్నప్పుడు, ఇతరుల పట్ల కరుణ ఉన్నప్పుడు సంతోషం సహజంగానే వస్తుంది. బయటి విషయాలు తాత్కాలిక ఆనందం ఇస్తాయి. కానీ నిజమైన సంతోషం మన మనసులో నుంచి మాత్రమే వస్తుంది.
1. కృతజ్ఞత చూపండి:
మీ వద్ద ఉన్న వాటి గురించి ప్రతిరోజూ ఆలోచించండి. ఆరోగ్యం, కుటుంబం, స్నేహితులు – ఇవన్నీ సంతోషానికి మూలాలని తెలుసుకోండి. లేని వాటి గురించి బాధపడకుండా, ఉన్నవాటిని గుర్తించి సంతోషపడండి.
2. ప్రస్తుతంలో జీవించండి:
గతం గురించి బాధపడటం, భవిష్యత్తు గురించి ఆందోళన చెందటం మానేయాలి. ఇప్పుడు ఉన్న ఈ క్షణాన్ని ఆస్వాదించాలి. ఒక కప్పు టీ తాగుతూ, పక్షుల కిలకిలారావాలు వింటూ చిన్న చిన్న పనుల్లోనే ఆనందాన్ని పొందవచ్చు.
3. ఇతరులకు సహాయం చేయండి:
ఇవ్వడంలోనే సంతోషం ఉంది. ఒక చిన్న సహాయం, ఒక మంచి మాట ఇవే మీకు ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయి.
4. ధ్యానం, యోగా ప్రాక్టీస్ చేయండి:
మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రతి రోజూ కొంత సమయం కేటాయించండి. ఇది మనలోని సంతోషాన్ని బయటపెడుతుంది.
5. సానుకూల ఆలోచనలు పెంచుకోండి:
నెగెటివ్ వార్తలకు దూరంగా ఉండండి. మంచి పుస్తకాలు చదవండి. పాజిటివ్‌గా ఆలోచనలు చేసే వ్యక్తులతో కలిసి ఉండానికి ప్రయత్నించండి.
సంతోషం ఒక ప్రయాణం కాదు, అది మార్గం. మీరు ఎలా జీవిస్తారో అది అలాగే మన దగ్గరకు వస్తుంది. ఈ చిన్న చిన్న పనులతో వెతకకుండానే సంతోషం మనవెంటే ఉంటుంది. జీవితాన్ని సంతోషంగా జీవించండి .. అదే నిజమైన విజయం!




