Heart: సోమ‌వారం గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..

బ్రిటీష్ కార్డియోవాస్కులర్ కమిటీ కూడా సోమవారం తీవ్రమైన గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని నమ్ముతుంది. అయితే ఏమాత్రం నిజం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు రావ‌డానికి రోజుకూ మ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక్క‌సారిగా ఒత్తిడి స్థాయిల పెర‌గ‌డం వ‌ల్ల గుండెపోటు...

Heart: సోమ‌వారం గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయా.? నిపుణులు ఏమంటున్నారంటే..
Heart Attack
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 02, 2024 | 5:17 PM

ప్ర‌స్తుతం గుండెపోటు బారిన ప‌డుతోన్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా భార‌త్‌లో గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్నారు. అయితే ఒక‌ప్పుడు 50 ఏళ్లు దాటిన వారిలో మాత్ర‌మే ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చేవి. అయితే పాతికేళ్లు కూడా నిండ‌ని వారిలో గుండె పోటు రావ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇదిలా ఉంటే గుండె సంబంధిత స‌మ‌స్య‌ల‌కు సంబంధించి ఎన్నో అపోహ‌లు ఉన్నాయి. అలాంటి వాటిలో ఒక‌టి సోమ‌వారం గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఇంత‌కీ ఇందులో ఎంత వ‌ర‌కు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

బ్రిటీష్ కార్డియోవాస్కులర్ కమిటీ కూడా సోమవారం తీవ్రమైన గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉందని నమ్ముతుంది. అయితే ఏమాత్రం నిజం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. గుండెపోటు రావ‌డానికి రోజుకూ మ‌ధ్య ఎలాంటి సంబంధం లేద‌ని నిపుణులు చెబుతున్నారు. ఒక్క‌సారిగా ఒత్తిడి స్థాయిల పెర‌గ‌డం వ‌ల్ల గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంద‌ని మాత్రం అంటున్నారు. సాధార‌ణంగా ఆదివారం సెల‌వు రోజు గ‌డిపిన త‌ర్వాత సోమ‌వారం డ్యూటీకి వెళ్లాల‌న్న ఒత్తిడి ఉంటుంది. అయితే ఈ ఒత్తిడే గుండెపోటు వ‌చ్చే అవ‌కాశానికి దారి తీస్తుంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఒత్తిడి కారణంగా, రక్తపోటు, చక్కెర స్థాయి గణనీయంగా పెరుగుతాయి. ఇది కూడా గుండెపోటు వ‌చ్చే ప్ర‌మాదాన్ని పెంచుతుంద‌ని చఅంటున్నారు.

తీవ్ర‌మైన ఒత్తిడితో బాధ‌ప‌డేవారిలో ఈ స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ముఖ్యంగా ఎక్కువ ఒత్తిడితో కూడుకున్న వ‌ర్క్ చేసే వారికి కూడా సోమ‌వారం గుండెపోటు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని అంటున్నారు. ఇక వారాంతాల్లో సాధార‌ణ రోజుల‌తో పోల్చితే ఎక్కువ ప‌నిచేస్తారు. ఈ కార‌ణంగా కూడా సోమ‌వారం గుండె సంబంధిత స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశాలు ఉంటాయ‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే సోమ‌వారం గుండెపోటు రావ‌డానికి నిర్ధిష్ట‌మైన కార‌ణం మాత్రం తెలియ‌రాలేదు.

మ‌రిన్ని లైఫ్ స్టైల్ వార్త‌ల కోసం క్లిక్ చేయండి..

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..