- Telugu News Photo Gallery These are the foods that provide vitamin B12 which is much needed by the body, check here is details
Vitamin B12 Foods: శరీరానికి ఎంతో అవసరమైన బి12 వీటిల్లోనే లభించేది..
ప్రస్తుత కాలంలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న చిన్నవే అయినా వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే పెద్దవిగా మారుతున్నాయి. మనిషి అధికంగా అవసరం అయ్యే విటమిన్లలో బి12 కూడా ఒకటి. బి1 లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కూడా బి12 కావాలి. శరీరంలో న్యూరలాజికల్ ఫంక్షన్ సరిగా జరగడానికి కూడా బి12 సహాయ పడుతుంది. బి12 లోపిస్తే.. గుండె దడ ఎక్కువై ఒత్తిడి పెరుగుతుంది. చర్మం పాలి పోయినట్లుగా అనిపిస్తుంది. శ్వాస ఆడటంలో..
Updated on: Aug 02, 2024 | 5:40 PM

ప్రస్తుత కాలంలో అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. చిన్న చిన్నవే అయినా వాటిని పట్టించుకోకుండా వదిలేస్తే పెద్దవిగా మారుతున్నాయి. మనిషి అధికంగా అవసరం అయ్యే విటమిన్లలో బి12 కూడా ఒకటి. బి1 లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఎర్ర రక్త కణాల ఏర్పాటుకు కూడా బి12 కావాలి.

శరీరంలో న్యూరలాజికల్ ఫంక్షన్ సరిగా జరగడానికి కూడా బి12 సహాయ పడుతుంది. బి12 లోపిస్తే.. గుండె దడ ఎక్కువై ఒత్తిడి పెరుగుతుంది. చర్మం పాలి పోయినట్లుగా అనిపిస్తుంది. శ్వాస ఆడటంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కూడా తగ్గుతుంది.

ప్రతి రోజూ పాలు తాగే వారిలో బి12 లోపం రాదు. దాదాపు అందరి ఇళ్లలో కూడా పాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి రోజూ ఒక గ్లాస్ పాలు తాగడం చాలా మంచిది. పాలలో బి12 అనేది ఎక్కువగా ఉంటుంది. పాలతో చేసిన పదార్థాల్లో కూడా బి12 లభిస్తుంది.

చికెన్‌లో కూడా ఎక్కువగా బి12 ఉంటుంది. బి12 లోపంతో బాధ పడేవారు చికెన్ తినవచ్చు. చికెన్‌తో చేసిన ఎలాంటి వంటలు అయినా తీసుకోవచ్చు. అదే విధంగా గుడ్లలో కూడా బి12 పుష్కలంగా లభిస్తుంది. ప్రతి రోజూ ఒక కోడి గుడ్డు తినడం వల్ల చాలా రకాల సమస్యలకు చెక్ పెట్టొచ్చు.

పెరుగు తినడం వల్ల కూడా విటమిన్ బి12 చక్కగా అందుతుంది. బి12 లోపంతో బాధపడేవారు పెరుగు కూడా తీసుకోవచ్చు. పన్నీర్ తినడం వల్ల కూడా విటమిన్ 12 అనేది బాగా లభిస్తుంది. పన్నీరును ఎలా తీసుకున్నా కూడా చక్కగా విటమిన్ బి12 అందుతుంది.





























