- Telugu News Photo Gallery If you try these tips, dandruff problem will be reduced, check here is details in Telugu
Dandruff Relief Tips: ఇవి ట్రై చేశారంటే చుండ్రు దెబ్బకి మాయం అవ్వాల్సిందే..
ప్రస్తుత కాలంలో అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు అనేది ప్రస్తుతం సర్వ సాధారణంగా మారింది. చుండ్రు ఎక్కువగా ఉంటే జుట్టు కూడా బాగా రాలిపోతుంది. ఫంగల్ ఇన్ ఫెక్షన్ కారణంగానే చుండ్రు అనేది ఎక్కువగా పడుతుంది. చుండ్రును తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేసే ఉంటారు కానీ ఇప్పుడు చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. చుండ్రు సమస్యను తగ్గించుకోవాలంటే ముందుగా వారంలో రెండు, మూడు సార్లు..
Updated on: Aug 02, 2024 | 6:27 PM

ప్రస్తుత కాలంలో అందరూ ఇబ్బంది పడే సమస్యల్లో చుండ్రు కూడా ఒకటి. చుండ్రు అనేది ప్రస్తుతం సర్వ సాధారణంగా మారింది. చుండ్రు ఎక్కువగా ఉంటే జుట్టు కూడా బాగా రాలిపోతుంది. ఫంగల్ ఇన్ ఫెక్షన్ కారణంగానే చుండ్రు అనేది ఎక్కువగా పడుతుంది.

చుండ్రును తగ్గించుకోవడానికి ఏవేవో ప్రయత్నాలు చేసే ఉంటారు కానీ ఇప్పుడు చిట్కాలు ఎంతో ఎఫెక్టీవ్‌గా పని చేస్తాయి. చుండ్రు సమస్యను తగ్గించుకోవాలంటే ముందుగా వారంలో రెండు, మూడు సార్లు తల స్నానం చేస్తూ ఉండాలి. షాంపూని తక్కువగా ఉపయోగించాలి.

మెంతులు, వేపాకులతో కూడా చుండ్రు సమస్యను తగ్గించుకోవచ్చు. మెంతుల్ని రాత్రంతా నీళ్లలో నానబెట్టి.. ఉదయం వేపాకులు వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టును తలకు అప్లై చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గిపోతుంది.

యాపిల్ సైడర్ వెనిగర్‌తో కూడా చుండ్రు సమస్యలను తగ్గించుకోవచ్చు. అంతే కాకుండా తలపై ఉండే ఇన్ ఫెక్షన్, ఫంగస్ కూడా తగ్గుతుంది. నీటిని, యాపిల్ సైడర్ వెనిగర్‌ను సమపాళ్లలో తీసుకుని జుట్టుకు బాగా పట్టించాలి. ఓ ఐదు నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే చుండ్రు పోతుంది.

కొబ్బరి నూనెలో కొద్దిగా బేకింగ్ సోడా, తేనె మిక్స్ చేసి.. తలకు బాగా పట్టించాలి. ఇలా తలపై 20 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత షాంపూతో తల స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తలపై ఉండే చుండ్రు సమస్య తగ్గుతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.





























