- Telugu News Photo Gallery Touching these parts of the body reduces stress, check here is details in Telugu
Stress Relief Tips: ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తుందా.. శరీరంలోని ఈ భాగాలు టచ్ చేస్తే మాయం..
స్ట్రెస్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. నేటి కాలంలో అందరూ ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నారు. కుటుంబంలోని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఉద్యోగంలోని పని ఒత్తిడి ఇలా చాలా రకాల సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్‌ని తీసుకోక తప్పదు. కానీ స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గుండె జబ్బులు..
Updated on: Aug 04, 2024 | 3:06 PM

స్ట్రెస్ అనేది ప్రస్తుతం చాలా కామన్ అయిపోయింది. నేటి కాలంలో అందరూ ఎక్కువగా స్ట్రెస్‌కి గురవుతున్నారు. కుటుంబంలోని సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక పరమైన ఇబ్బందులు, ఉద్యోగంలోని పని ఒత్తిడి ఇలా చాలా రకాల సమస్యలు వెంటాడుతున్నప్పుడు ఖచ్చితంగా స్ట్రెస్‌ని తీసుకోక తప్పదు.

కానీ స్ట్రెస్‌ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా డయాబెటీస్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కానీ ఎంత స్ట్రెస్ ఉన్నా.. శరీరంలోని కొన్ని భాగాలపై టచ్ చేస్తే ఒత్తిడి తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. కనుబొమ్మలపై మసాజ్ చేయడం వల్ల కోపం, చిరాకు, ఒత్తిడి తగ్గుతుంది. కనుబొమ్మలను వేళ్లతో సున్నితంగా పట్టుకుని ఓ ఐదు నిమిషాలు నొక్కడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

అదే విధంగా దవడపై మసాజ్ చేయడ వల్ల కూడా ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ప్రతి రోజూ కొద్ది సేపు దంతాలను బిగించి.. రెండు దవడలను వృత్తాకార కదలికలో మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనసు తేలిక పడి.. ఒత్తిడి తగ్గుతుంది.

ఒత్తిడి ఎక్కువగా అనిపించినప్పుడు మెడ, భుజాలపై నొక్కి మసాజ్ చేయడం వల్ల కాస్త రిలీఫ్ చెందుతారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రతి రోజూ మీ భుజాలను ఊపడం మంచిది. అలాగే సున్నితంగా నొక్కుతూ ఉంటే బెటర్.




