Dehydration: దాహం మాత్రమే కాదు ఈ లక్షణాలు కనిపిస్తే నీరు తాగాలని హెచ్చరిక..

శరీరంలో నీటి కొరత వేసవిలోనే కాదు ఏ సీజన్‌లోనైనా రావచ్చు. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు తరచుగా తాగే నీరు విషయంలో అలక్షం చూపిస్తారు. నీరు తాగడం తగ్గిస్తారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కనుక దాహం వేసినప్పుడు మాత్రమే కాదు ఈ లక్షణాలు కనిపించినా నీరు త్రాగాలి. ఆ లక్షణాలు ఏమిటో ఎలా వాటిని గుర్తించాలో ఈ రోజు తెలుసుకుందాం..

Dehydration: దాహం మాత్రమే కాదు ఈ లక్షణాలు కనిపిస్తే నీరు తాగాలని హెచ్చరిక..
Dehydration
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2024 | 6:41 PM

ప్రజలు దాహం వేసినప్పుడు అంటే గొంతు ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు తాగుతారు. అయితే ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి ప్రతిరోజూ కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు త్రాగాలని సలహా ఇస్తున్నప్పటికీ.. ఎక్కువ మంది ప్రజలు నీరు తాగే విషయానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వరు. చాలా తక్కువ నీరుని తాగుతారు. నిజానికి నీరు శరీరంలో తేమను నిర్వహించడానికి మాత్రమే కాదు.. విటమిన్లు, ఖనిజాల మూలకంగా కూడా పనిచేస్తుంది. చాలా సార్లు మనం శరీరంలో కనిపించే చిన్న చిన్న సమస్యలను విస్మరిస్తాము. దీని కారణంగా ఆరోగ్య సమస్యలు కొన్నిసార్లు పెరుగుతాయి. దాహం వేయడమే కాదు మన శరీరం నీరు త్రాగమంటూ మరికొన్ని సంకేతాలను కూడా ఇస్తుంది. వాటిని గుర్తించడం ముఖ్యం.

శరీరంలో నీటి కొరత వేసవిలోనే కాదు ఏ సీజన్‌లోనైనా రావచ్చు. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు తరచుగా తాగే నీరు విషయంలో అలక్షం చూపిస్తారు. నీరు తాగడం తగ్గిస్తారు. ఇది అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. కనుక దాహం వేసినప్పుడు మాత్రమే కాదు ఈ లక్షణాలు కనిపించినా నీరు త్రాగాలి. ఆ లక్షణాలు ఏమిటో ఎలా వాటిని గుర్తించాలో ఈ రోజు తెలుసుకుందాం..

అలసటగా, నిద్రగా అనిపిస్తుంటే

ఇవి కూడా చదవండి

పని చేసినా చేయకపోయినా అలసిపోయినట్లు లేదా నిద్రవస్తున్నట్లు అనిపించడం ప్రారంభిస్తే.. ఎక్కువ మంది రిఫ్రెష్‌ అవ్వడానికి ఒక కప్పు కాఫీ లేదా టీ తాగడానికి పరుగెత్తుతారు. అయితే ఈ అలవాటు మీ శరీరం మరింత నిర్జలీకరణ అవ్వడానికి కారణమవుతుంది. అస్తవమను అలసటగా అనిపించడం, నిద్రపోవాలి అనే ఫీలింగ్ రావడానికి కారణం శరీరంలో నీటి కొరత కారణం కావచ్చు, కనుక ఇలాంటి ఫీలింగ్ కలిగినప్పుడు కాఫీ , టీల కంటే నీరు త్రాగాలి.

పసుపు మూత్రం రంగు

మూత్రం రంగు చాలా పసుపు రంగులో కనిపిస్తే శరీరానికి నీరు అవసరం అనే హెచ్చరిక కావొచ్చు. అంతేకాదు మూత్రం తక్కువగా వస్తున్నట్లయితే లేదా టాయిలెట్కు కు వెళ్ళడానికి చాలా సమయం తీసుకుంటే శరీరానికి నీరు అవసరం అని కూడా అర్థం.

తలనొప్పి కలిగి

శరీరంలో నీరు అవసరమైనప్పుడు తలనొప్పి సమస్య బారిన కూడా పడొచ్చు. అందువల్ల తలనొప్పి వచ్చిన ప్రతిసారీ ఔషధం తీసుకోవలసిన అవసరం లేదు. అందుకు బదులుగా కొంచెం నీరు త్రాగాలి . దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఇలా చేసిన తరువాత కూడా ఉపశమనం కలగకపోతే అప్పుడు మాత్రమే ఔషధం సహాయం తీసుకోవాలి.

పొడి పెదవులు, నోటి దుర్వాసన

శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు గొంతు పొడిబారడమే కాకుండా పెదాలు కూడా పొడిబారడం మొదలవుతుంది. అంతేకాదు నోటి దుర్వాసన సమస్య కూడా ఏర్పడుతుంది. ఈ పరిస్థితిలో కూడా వెంటనే నీరు త్రాగాలి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)