Andhra Pradesh: రాత్రికి రాత్రీ 90 ఏళ్ల నాటి చెట్లను నరికేసిన అన్నదమ్ములు..సెంటిమెంట్ రీజన్ వింటే షాక్ తినాల్సిందే..
ఈ చెట్లునాటి సుమారు 90 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే శనివారం రాత్రి సమయంలో గ్రామానికి చెందిన కురువ లింగప్ప, కురువమల్లయ్య, కురువ రామచంద్ర, కుడుము భీమయ్య, గడ్డం భీమయ్య, బంగారు భీమయ్య అనేవ్యక్తులు రాత్రికి రాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు రాఘవరెడ్డి విలేకరులకు తెలిపారు. అంతకుముందు రోజు అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని ఈ భారీ వృక్షాలను నరకవద్దని గ్రామస్తులను హెచ్చరించారు.
సెంటిమెంటును అదే సెంటిమెంట్ నరికేసింది. ఏ చెట్ల కింద అయితే రథోత్సవం నిర్వహిస్తారో.. అవే చెట్ల కారణంగా అన్నదమ్ముల మధ్య గొడవలు వస్తున్నాయని 1932 నాటి చారిత్రక భారీ వృక్షాలను నరికివేశారు. సాయంత్రం పచ్చగా ఉన్న చెట్లు ఉదయాన్నే నేలమట్టం కావడం చూసి భక్తులు సెంటిమెంటుతో రగిలిపోతున్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసేందుకు అటవీ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఇంతకు ఈ చెట్ల నరికివేత సంగతి ఏంటంటే….
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంట గ్రామంంలో 1932వ సంవత్సరంలో శ్రీ కరివీరభద్రస్వామి రథోత్సవం నిర్వహించే రహదారికి ఇరువైపులా సర్వేనంబర్ 71జె2సిలో సుమారు 20 సెంట్లను సొంతంగా కొనుగోలు చేసి వేపచెట్లు, బసిరిచెట్లను ఆలయ ధర్మకర్తలైన కె. రాఘవరెడ్డి ఆధర్వ్యం పెంచారు. ఇప్పటివరకు శ్రీ కరివీరభద్రస్వామి రథోత్సవం ఊరేగింపు ఈ రహదారి చెట్లు మద్యలో నే సాగుతోంది. ఈ చెట్లునాటి సుమారు 90 సంవత్సరాలు పూర్తయ్యింది. అయితే శనివారం రాత్రి సమయంలో గ్రామానికి చెందిన కురువ లింగప్ప, కురువమల్లయ్య, కురువ రామచంద్ర, కుడుము భీమయ్య, గడ్డం భీమయ్య, బంగారు భీమయ్య అనేవ్యక్తులు రాత్రికి రాత్రి మెషిన్లతో ఈ భారీ వృక్షాలను కూల్చినట్లు రాఘవరెడ్డి విలేకరులకు తెలిపారు. అంతకుముందు రోజు అటవీశాఖ అధికారులు గ్రామానికి చేరుకొని ఈ భారీ వృక్షాలను నరకవద్దని గ్రామస్తులను హెచ్చరించారు. అయినాసరే అధికారుల ఆదేశాలను తుంగలోతొక్కుతూ వృక్షాలను కూల్చినట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న మంత్రాలయం పోలీసులు ఆదివారం నేలకూల్చిన భారీ వృక్షాలను పరిశీలించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి భారీ వృక్షాలను కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
ఈ వృక్షాలను తొలగించడానికి అనేక కారణాలు ఉన్నాయని కురువ లింగన్న విలేకరులకు తెలియజేశారు. ఈ చెట్ల వల్ల అన్నదమ్ముల మధ్య చిచ్చు చెలరేగుతుందని తరచూ గొడవలు పడుతున్నామని వారు తెలిపారు. అంతేకాకుండా భారీ గాలి వాన వస్తే చెట్లు విరిగి ఇంటిపై పడుతున్నాయని భయంతో చెట్లు నరికినట్ల కూడ కురువ లింగన్న తెలిపారు.
మరిని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..