Pink Pineapple: అందంలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లో మిన్న పింక్ పైనాపిల్.. ధరలోనే కాదు రుచిలోనూ టాప్..

అత్యంత ప్రజాదరణ పొందిన పండ్లలో అనాస పండు ఒకటి. పోషకాలు అధికంగా ఉండే అనాస పండుని అలాగే ముక్కలు కట్ చేసి తింటారు. లేదా రకరకాల ఆహర పదార్ధాలను తయారు చేస్తారు. అయితే పసుపు రంగు పైనాపిల్ గురించి ప్రతి ఒక్కరికీ తెలుసు.. కానీ గులాబీ రంగులో ఉండే పైనాపిల్స్‌ గురించి మాత్రం అరుదుగా తెలుసు. ఎందుకంటే ఇది చాలా అరుదైన ఖరీదైన పండు.

Pink Pineapple: అందంలోనే కాదు ఆరోగ్య ప్రయోజనాల్లో మిన్న పింక్ పైనాపిల్.. ధరలోనే కాదు రుచిలోనూ టాప్..
Pink Pineapple
Follow us
Surya Kala

|

Updated on: Sep 23, 2024 | 3:24 PM

గులాబీ లేదా ఎరుపు రంగు తో వెరీ వెరీ స్పెషల్ గా కనిపిస్తుంది. పింక్ పైనాపిల్స్ ఈ రంగుని లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ కారణంగా పొందుతుంది. ఇది టమోటాలు పుచ్చకాయలలో కూడా కనిపిస్తుంది.  లైకోపీన్ అన్ని పైనాపిల్స్‌లో సహజంగా ఉంటుంది. అయితే సాంప్రదాయ పైనాపిల్స్‌లో బీటా-కెరోటిన్‌గా రూపాంతరం చెందుతుంది. వాటిని పసుపుగా మారుస్తుంది. లైకోపీన్‌ను బీటా-కెరోటిన్‌గా మార్చే తక్కువ స్థాయి ఎంజైమ్‌లను ఉత్పత్తి చేసి పసుపు అనాస పండ్లు.. జన్యుపరంగా పింక్ పైనాపిల్స్ గా మార్పు చేయబడ్డాయి. US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం 2016లో తినడానికి సురక్షితమైనది అని ప్రకటించింది.

పింక్ పైనాపిల్స్ రుచి ఎలా ఉంటుందంటే

పింక్ పైనాపిల్స్ వాటి పసుపు అనాస పండు మాదిరిగానే రుచిని కలిగి ఉంటాయి. అయితే గులాబీ అనాస పండు కొంచెం తియ్యగా, జ్యుసిగా ఉండడమే కాదు తక్కువ పుల్లగా ఉంటాయి. అంటే పింక్ పైనాపిల్స్ సుగంధాల రుచితో ప్రత్యేకంగా ఉంటాయి.

పింక్ పైనాపిల్స్ ఎక్కడ పండుతాయంటే

పింక్ పైనాపిల్‌లను ఉత్పత్తి చేసే ఏకైక కంపెనీ డెల్ మోంటే. ఇది 2015లో ‘రోస్’ పేరుతో పేటెంట్ పొందింది. పింక్‌గ్లో పేరుతో అమ్ముతున్న పింక్ పైనాపిలల్స్ లేదా ఈ రోస్ పైనాపిల్స్‌ను దక్షిణ-మధ్య కోస్టా రికాలోని ఒక పొలంలో పండిస్తారు. అగ్నిపర్వతాల్లోని నేల, ఉష్ణమండల వాతావరణంలో ఈ గులాబీ ఫినాపిల్స్ పండుతాయి. ఈ పింక్ పైనాపిల్స్ అమ్మకం కూడా పసుపు పైనాపిల్స్ కంటే డిఫరెంట్ గా ఉంటుంది. వీటిని కాండం లేకుండానే రవాణా చేస్తారు. ఈ తాజా కాండం మళ్ళీ కొత్త గులాబీ పైనాపిల్‌ విత్తుగా నాటడానికి ఉపయోగిస్తారు.

ఇవి కూడా చదవండి

పింక్ పైనాపిల్స్ ఎక్కడ కొనవచ్చు అంటే

ఈ పింక్ పైనాపిల్స్ అమెరికా, కెనడాలో మాత్రమే లభ్యమవుతాయి. వీటిని ట్రాపికల్ ఫ్రూట్ బాక్స్ లేదా మెలిస్సా వంటి సైట్‌ల నుంచి లొకేషన్‌ను బట్టి ,కొన్ని కిరాణా దుకాణాల్లో ప్రాంతాల్లో, లేదా ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేస్తే పింక్ పైనాపిల్ ప్రామాణీకరణ సర్టిఫికేట్, రెసిపీ విధానంతో ఉన్న బుక్‌లెట్‌ పెట్టి ఒక బాక్స్ లో పెట్టి వస్తుంది.

పింక్ పైనాపిల్స్ ధర ఎంత?

సాంప్రదాయ పసుపు అనాస పండు ధర కంటే ఈ గులాబీ అనాస పండు ధర కొంచెం ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ ఇవి అన్ని స్టోర్లలో అందుబాటులో ఉండవు.

ఇవి ఎందుకు అంత ఖరీదు అంటే

పింక్ పైనాపిల్స్ పెరగడానికి దాదాపు రెండు సంవత్సరాలు పడుతుంది. అంతేకాదు ఈ పంట కోస్టా రికాలోని ఒక పొలంలో మాత్రమే పండిస్తారు. కనుక ఈ గులాబీ అనాస పండు సరఫరా తక్కువగా ఉంటుంది. అదే సమయంలో డిమాండ్ ఎక్కువగా ఉంది. అంతేకాదు ఈ మొక్క పై డెల్ మోంటేకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం ఈ మొక్కని ఎక్కడా ఎవరూ పెంచుకోవడానికి అనుమతి లేదు.

పింక్ పైనాపిల్స్ ఎన్ని రోజులు నిల్వ ఉంటుందంటే

పింక్ పైనాపిల్స్ కౌంటర్‌లో మూడు రోజులు.. ఫ్రిజ్‌లో రెండు రోజులు నిల్వ ఉంటాయి. అయితే పింక్ పైనాపిల్ ను ముక్కలు చేసి రిఫ్రిజిరేటర్‌లో పెడితే ఒక వారం రోజులు ఫ్రీజర్‌లో పెడితే మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది. అయితే దీని జీవితం కాలం తక్కువ కనుక త్వరగా తినడం మంచిది.

పసుపు పైనాపిల్ తో చేసే ఏ రెసిపీలోనైనా పింక్ పైనాపిల్‌ను ఉపయోగించవచ్చు. అయితే పింక్ పైనాపిల్‌ చాలా తీపిగా, జ్యుసిగా ఉంటుంది. అంతేకాదు ఎక్కువ ధర కనుక పింక్ పైనాపిల్‌ రుచిని ఎంజాయ్ చేయాలంటే నేరుగా తినొచ్చు. మంచి అనుభూతిని ఇస్తుంది. పసుపు అనాస పండు కంటే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

ప్రభాస్ సలార్ పార్ట్ 2 'శౌర్యాంగ ప‌ర్వం’ రిలీజ్ ఎప్పుడంటే?
ప్రభాస్ సలార్ పార్ట్ 2 'శౌర్యాంగ ప‌ర్వం’ రిలీజ్ ఎప్పుడంటే?
పక్షవాతం వచ్చే ముందు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.. జాగ్రత్త!
పక్షవాతం వచ్చే ముందు ఇలాంటి లక్షణాలే కనిపిస్తాయి.. జాగ్రత్త!
‘క్యాట్‌’లో తెలుగోళ్ల సత్తా.. ముగ్గురికి 100 పర్సంటైల్‌ స్కోర్‌!
‘క్యాట్‌’లో తెలుగోళ్ల సత్తా.. ముగ్గురికి 100 పర్సంటైల్‌ స్కోర్‌!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
రామ్ చరణ్ దెబ్బతో ఇండస్ట్రీ రేంజ్, లెక్కలు మారిపోయినట్టే.!
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
ఎప్పటినుంచో ఓకే నిర్మాణ సంస్థల్లో చిత్రాలు.. ఆ దర్శకులు ఎవరు.?
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
'ఫ్యాన్స్ ముసుగులో అభ్యంతరకర పోస్టులు'.. అల్లు అర్జున్ వార్నింగ్
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
గర్భిణీలు మటన్ లివర్ తింటే ఏమవుతుంది? వైద్యులు ఏం చెబుతున్నారు?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
APSCHE ఛైర్మన్‌గా మధుమూర్తి.. లెక్కకుమించి సవాళ్లు పరిష్కరించేనా?
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
పెళైన 12 రోజులకు ప్రాణాలు కోల్పోయిన యువకుడు!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ