AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cowpeas: ఎన్నో రోగాలకు చెక్ పెట్టే ఈ ఔషధాన్ని మర్చిపోయారా..

బొబ్బర్లు.. ఇవి గింజల జాతికి చెందినవి. పూర్వం వీటిని ఎక్కువగా తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో బొబ్బర్లు అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. వీటితో వడలు, పునుగులు, దోశలు, ఇతర వంటలు తయారు చేసేవారు. బొబ్బర్లను ఉడకబెట్టి స్నాక్‌లా కూడా తీసుకునేవారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కేవలం రుచి మాత్రమే కాకుండా ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. బొబ్బర్లలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి, రాగి, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్..

Cowpeas: ఎన్నో రోగాలకు చెక్ పెట్టే ఈ ఔషధాన్ని మర్చిపోయారా..
Cowpeas
Chinni Enni
|

Updated on: Sep 23, 2024 | 1:21 PM

Share

బొబ్బర్లు.. ఇవి గింజల జాతికి చెందినవి. పూర్వం వీటిని ఎక్కువగా తీసుకునేవారు. కానీ ప్రస్తుత కాలంలో బొబ్బర్లు అంటే పెద్దగా ఎవరికీ తెలీదు. వీటితో వడలు, పునుగులు, దోశలు, ఇతర వంటలు తయారు చేసేవారు. బొబ్బర్లను ఉడకబెట్టి స్నాక్‌లా కూడా తీసుకునేవారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. కేవలం రుచి మాత్రమే కాకుండా ఇందులో ఉండే పోషకాలు అన్నీ ఇన్నీ కావు. బొబ్బర్లలో ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు ఎ, బి1, బి2, బి3, బి5, బి6, సి, రాగి, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, క్యాల్సియం, ఫోలిక్ యాసిడ్, సోడియం వంటివి పుష్కలంగా లభిస్తాయి. బొబ్బర్లు చిన్న పిల్లలకు ఇవ్వడం వల్ల వారి ఎదుగుదలలో మంచి తేడాలు కనిపిస్తాయి. బొబ్బర్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

బ్యాడ్ కొలెస్ట్రాల్‌ కరుగుతుంది:

బొబ్బర్లు తినడం వల్ల మంచి పోషకాలు అందుతాయి. ఇవి శరీరంలోని పేరుకు పోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగిస్తాయి. ఇవి ప్లాస్మాలో ఉండే చెడు కొవ్వును మొత్తాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని వల్ల రక్త ప్రసరణ సజావుగా జరిగి.. గుండె సమస్యలు, బీపీ వంటి సమస్యలు అదుపులోకి వస్తాయి.

షుగర్ కంట్రోల్:

బొబ్బర్లు తినడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ తరచూ బొబ్బర్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. దీంతో తక్కువగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. ఎక్కువగా తీసుకోలేం. కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిలు అనేవి తగ్గుతాయి.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గుతారు:

బరువు తగ్గాలి అనేకునేవారు ఖచ్చితంగా మీ డైట్‌లో బొబ్బర్లను యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో కొవ్వులు అనేవే ఉండవు. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. ఇవి బరువును అదుపులో ఉంచేందుకు హెల్ప్ చేస్తాయి. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు బొబ్బర్లను మీ డైట్‌లో చేర్చుకోండి.

చర్మ ఆరోగ్యం:

బొబ్బర్లలో ప్రోటీన్ అధికంగా లభిస్తుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయ పడుతుంది. చర్మ రంధ్రాలు తెరుచుకునేలా చేస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ఎ, సి చర్మ కణాలను రక్షించి.. త్వరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తాయి. అదే విధంగా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతాయి. క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్, ఎముకలు వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..