Dasara 2024: నవరాత్రి తొమ్మిది రోజులు పెరిగే అమ్మవారి విగ్రహం సైజ్.. పాండవుల కులదేవత ఆలయం ఎక్కడంటే

ఆ గుడిలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ఏడాది పొడవునా సాధారణంగా ఉంటుంది. అయితే దేవీ నవరాత్రి తొమ్మిది రోజుల్లో అమ్మవారి విగ్రహం పరిమాణం రోజురోజుకు పెరుగుతుంది. నవరాత్రులలో తొమ్మిదో రోజు నవమి రోజున అమ్మవారి విగ్రహాన్ని గర్భగుడి నుంచి బయటకు తీస్తారు. దసరా పండగ రానున్న నేపద్యంలో అరుదైన మహిమనిత్వమైన అమ్మవారి ఆలయం గురించి వివరాలు తెలుసుకుందాం..

Dasara 2024: నవరాత్రి తొమ్మిది రోజులు పెరిగే అమ్మవారి విగ్రహం సైజ్.. పాండవుల కులదేవత ఆలయం ఎక్కడంటే
Pandavas Kuldevi Temple
Follow us

|

Updated on: Sep 23, 2024 | 3:11 PM

దేశ వ్యాప్తంగా దేవి నవరాత్రుల సందడి మొదలైంది. అమ్మవారి ఆలయాలు అందంగా ముస్తాబు అవుతున్నాయి. తన భక్తులను రక్షించడానికి అమ్మవారు ఎక్కడ ఉద్భవిమ్చిందో ఆ ఆలయాల్లో కొలువైన అమ్మవారిని అమ్మవారి భక్తులు అత్యంత భక్తిశ్రద్దలతో నవరాత్రి తొమ్మిది రోజులు పూజిస్తారు. ప్రతి ఆలయానికి సంబంధించిన ఎన్నో జానపద, పౌరాణిక కథలు ఉన్నాయి. దేశంలోనే అత్యంత అద్భుతమైన దేవాలయాల్లో ఒకటి పాండవుల కులదేవి దేవాలయం. ఆ గుడిలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహం ఏడాది పొడవునా సాధారణంగా ఉంటుంది. అయితే దేవీ నవరాత్రి తొమ్మిది రోజుల్లో అమ్మవారి విగ్రహం పరిమాణం రోజురోజుకు పెరుగుతుంది. నవరాత్రులలో తొమ్మిదో రోజు నవమి రోజున అమ్మవారి విగ్రహాన్ని గర్భగుడి నుంచి బయటకు తీస్తారు. దసరా పండగ రానున్న నేపద్యంలో అరుదైన మహిమనిత్వమైన అమ్మవారి ఆలయం గురించి వివరాలు తెలుసుకుందాం..

మధ్యప్రదేశ్‌లోని మోరెనా సమీపంలోని కైలాస-పహర్‌ఘర్ రహదారి సమీపంలోని అటవీ ప్రాంతంలోని కొండలలో ఉంది. ఇక్కడ వనదేవత భవానీ ఆలయంలో ‘భరరేవాలి మాత’గా ప్రతిష్టించబడింది. ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే నవరాత్రుల తొమ్మిది రోజులలో అమ్మవారి విగ్రహం ప్రతిరోజూ పెరుగుతూ ఉంటుంది. నవమి రోజున ప్రతిష్టించిన విగ్రహాన్ని గర్భగుడి నుంచి బయటకు తీస్తారు. పాండవులు వనవాస సమయంలో ఇక్కడ కులదేవిని పూజించారని ఈ ఆలయం గురించి పురాణ కథనం. పూజ సమయంలో కులదేవి రాతిలోకి ప్రవేశించింది. ఆలయంలో ప్రతిష్టించిన శిలా విగ్రహానికి కొత్త రూపం ఇవ్వాలని స్థానికులు ఎన్నోసార్లు ప్రయత్నించినా.. ప్రత్నించిన ప్రతిసారీ అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. మహాభారతంలో కూడా ఈ ఆలయానికి సంబంధించిన కథ కనిపిస్తుంది. పాండవులు వనవాస సమయంలో ఇక్కడికి తమ కుల దేవతని ప్రతిష్టించారని తెలుస్తోంది. 152లో స్థానిక నివాసితులు భరరేవాలి మాతకు ఒక ఇంటిని నిర్మించారని … 1621లో ఖండేరావ్ భగత్ బహారా అనే భక్తుడు అమ్మవారి ఆలయాన్ని నిర్మించారని నమ్మకం. అప్పటి నుంచి నేటికీ ఆ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిత్యం కొనసాగుతున్నాయి.

వాసంతి, శారదీయ నవరాత్రుల సందర్భంగా ఈ ఆలయంలోని అద్భుతాన్ని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు పోటెత్తారు. ఈ సమయంలో కూడా ఆలయ ప్రాంగణంలో పెద్ద జాతర జరుగుతుంది. ఈ ఆలయం చుట్టూ పురాణ గాధలు ఉన్నాయి. పాండవులు కులదేవిని భక్తి శ్రద్దలతో పూజించడంతో అమ్మవారు సంతోషించి అర్జునుడితో అర్జునా, నీ భక్తికి, పూజకు నేను సంతోషిస్తున్నాను. నేకు ఎలాంటి వధువు కావాలి అని వరం ఇవ్వడానికి అడిగితే అర్జునుడు అమ్మవారికి సమాధానంగా ఓ తల్లీ నీ నుండి నాకు ఎలాంటి వరం అక్కర్లేదు. అలాగే పెళ్ళికావాలనే ఆశతో నేను పూజించలేదు. నా ఏకైక కోరిక ఏమిటంటే.. మా 12 సంవత్సరాల వనవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం గడిపే సమయంలో మాతో ఉంటూ మమ్ము కాపాడు తల్లి అని కోరాడట.

ఇవి కూడా చదవండి

అర్జునుడి సమాధానానికి సంతోషించిన దేవి స్వయంగా అర్జునుడికి వరం ఇస్తూ నా ప్రియ భక్తుడివైన నీవు అడిగిన కోరికను నేను నిన్ను తిరస్కరించలేను. అర్జునా నీతో ఉండటానికి నేను అంగీకరిస్తున్నాను. అయితే నువ్వు ఎప్పుడూ ముందుంటావు.. నీ వెనుక నేను ఉంటాను. నువ్వు ఎప్పుడైనా నన్ను చూడాలని వెనుకకి తిరిగి చూస్తే అక్కడ నేను శాశ్వతంగా నివాసం ఏర్పాటు చేసుకుంటానని అర్జునుడికి చెప్పగా అర్జునుడు అమ్మవారి కండిషన్ కు అంగీకరించాడు. అరణ్యంలో చాలా దూరం నడిచిన తర్వాత అర్జునుడు నగర రహదారికి చేరుకున్నాడని చెబుతారు. అయితే తన వెనుక కులదేవి వస్తుందా లేదా అనే సందేహంతో ఇక్కడ వెనుదిరిగాడట. అమ్మవారు పెట్టిన కండిషన్ మరచిపోయిన అర్జునుడు. హస్తినాపూర్ నుండి అర్జునుని అనుసరింస్తూ వచ్చిన అమ్మవారు ఎక్కడైతే అర్జునుడు వెనిక్కి తిరిగి చూశాడో అక్కడ కులదేవత ఒక రాతిలోకి ప్రవేశించిందట. తర్వాత అర్జునుడు కులదేవిని ఎంత వేడుకున్నా కదలక.. అర్జునా, ఇప్పుడు నేను ఈ శిల రూపంలో ఇక్కడే కొలువై ఉంటానని చెప్పిందట.

నాటి నుండి నేటి వరకు పాండవుల కులదేవి శిలారూపంలో పూజింపబడుతోంది. భరరేవాలి మాత ఆలయంలో అద్భుతమైన ఒక సరస్సు ఉంది. ఈ సరస్సులోని నీరు ఎప్పుడూ ఎండిపోదు. భక్తులు ఈ నీటిని సేవిస్తే సకల పాపాలు, దోషాలు తొలగిపోతాయని నమ్మకం. ఇది కాదు కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని విశ్వాసం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి