AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chanakya Niti: ఈ 3 రకాల వ్యక్తులకు వీలైంత దూరంగా ఉండమంటున్న చాణక్య.. లేదంటే మీ జీవితం నాశనం అట

కొన్ని సార్లు మీరు చేసే సహాయం అవతలి వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. సరి కదా.. సహాయం చేసిన మీరు నష్టపోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో సాయం చేసే సమయంలో సాధ్యాసాధ్యాలను... వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా మూడు రకాలకు చెందిన వ్యక్తులకు సాయం చేయడం అంటే మీరు కూర్చుకున్న కొమ్మని మీరే నరికేసు కోవడం వంటిదే అని అన్నాడు. ఈ రోజు పొరపాటున కూడా సాయం చేయకూడని 3 రకాల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం..

Chanakya Niti: ఈ 3 రకాల వ్యక్తులకు వీలైంత దూరంగా ఉండమంటున్న చాణక్య.. లేదంటే మీ జీవితం నాశనం అట
Chanakya Niti
Surya Kala
|

Updated on: Sep 23, 2024 | 4:26 PM

Share

ఎవరికైనా సహాయం చేయడం పుణ్య కార్యంగా పరిగణించబడుతుంది. మనిషి ఇతరులకు సహాయం చేయడం కూడా ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి సంకేతం. అయితే కొన్ని సార్లు మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకున్నా పరిస్థితుల అనుకూలించక పోతే సహాయం చేయలేరు. అప్పుడు మీ అసహాయతని మీ మంచి ఉద్దేశ్యాన్ని అర్ధం చేసుకుని కాలం కలసి రాలేదు అని సరిపెట్టుకుంటారు. అయితే కొన్ని సార్లు మీరు చేసే సహాయం అవతలి వ్యక్తికి ఎటువంటి ప్రయోజనం ఇవ్వదు. సరి కదా.. సహాయం చేసిన మీరు నష్టపోవాల్సి వస్తుంది. అటువంటి పరిస్థితిలో సాయం చేసే సమయంలో సాధ్యాసాధ్యాలను… వ్యక్తుల వ్యక్తిత్వాన్ని అంచనా వేయాలని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా మూడు రకాలకు చెందిన వ్యక్తులకు సాయం చేయడం అంటే మీరు కూర్చుకున్న కొమ్మని మీరే నరికేసు కోవడం వంటిదే అని అన్నాడు. ఈ రోజు పొరపాటున కూడా సాయం చేయకూడని 3 రకాల వ్యక్తులు ఎవరో తెలుసుకుందాం..

గుణం, సంస్కారం లేని స్త్రీ

గుణం లేని స్త్రీని పెళ్లి చేసుకోవడం.. వైవాహిక జీవితాన్ని నాశనం చేస్తుందని చాణక్యుడు చెప్పాడు. కనుక అలాంటి స్త్రీని ఎప్పటికీ వివాహం చేసుకోకూడదు. గుణం లేని మహిళలు భర్త, కుటుంబ పురోగతికి అడ్డంకులుగా మారతారు. అందువల్ల జీవిత భాగస్వామిని తెలివిగా ఎన్నుకోండి. అంతేకాదు గుణం లేని స్త్రీలను జీవితంలో చాలా దూరం ఉంచండి.

తెలివితక్కువ శిష్యుడు

ఆచార్య చాణక్యుడు ప్రకారం ఒక తెలివితక్కువ శిష్యుడికి ఎటువంటి పాఠాన్ని ఎన్నటికీ వివరించలేము. అటువంటి పరిస్థితిలో తెలివి తక్కువ శిష్యుడి కోసం మీ సమయాన్ని, శక్తిని ఖర్చు చేయడంలో అర్థం లేదు. అలాంటి శిష్యులు తమకు తెలిసింది కరెక్ట్ అనుకుంటారు. ఇతరులు చెప్పేది పట్టించుకోరు. అటువంటి పరిస్థితిలో ఇలాంటి వ్యక్తుల కోసం సమయం వృధా చేయడం పనికిరానిది. అలాంటి వ్యక్తుల నుంచి కూడా దూరం ఉండాలి.

ఇవి కూడా చదవండి

అనారోగ్య వ్యక్తి

అనారోగ్యంతో ఉన్న వ్యక్తి ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తాడు. అంతేకాదు ఎల్లప్పుడూ విచారంగా ఉంటాడు. అంతేకాదు ఆరోగ్యంగా సంతోషంగా ఉండే వ్యక్తులను తమకు అనుగుణంగా మార్చుకుంటారు.. వారిని ముందుకు సాగనివ్వరు. అటువంటి పరిస్థితిలో ఆచార్య చాణక్యుడు అనారోగ్యంతో ఉన్నవారికి కూడా సరైన దూరం పాటించాలని చెప్పారు.

ఇటువంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండమంటున్న చాణక్య

ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే కాదు.. కొన్ని లక్షణాలున్న ఇతర రకాల వ్యక్తులను కూడా దూరం ఉంచడం మంచిది. ఎప్పుడూ అబద్ధాలు చెప్పేవాళ్లు, మాటలకు కట్టుబడి ఉందని వారు, మద్యానికి బానిసైన వారికి, స్వార్థపరులు, అత్యాశతో ఉండే వ్యక్తులకు వీలైనంత దూరం పాటించాలి, లేకుంటే భవిష్యత్తులో పశ్చాత్తాప పడవలసి వస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..