- Telugu News Photo Gallery Can there be a puja room in the kitchen? What does Vastu Shastra say? Check Here is Details
Vastu Tips: కిచెన్‌లో పూజగది ఉండొచ్చా.. వాస్తుశాస్త్రం ఏం చెబుతుంది?
సాధారణంగా కొన్ని ఇంట్లో చోటు అడ్జెస్ట్ అవక పోవడం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల పూజ చేసుకునే గది కిచెన్, బెడ్ రూమ్, హాల్‌లో వస్తాయి. మరి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఎక్కడ ఉండటం వల్ల మంచి జరుగుతుంది? ఎక్కడ ఉంటే లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు గదులు చాలా ఇరుగ్గా ఉండక పోవడంతో కిచెన్‌లోనే ఎక్కువగా దేవుడికి సపరేటుగా షెల్ఫ్ పెడుతున్నారు. సాధారణంగా దేవుడి గది ఇతర గదులకు దూరంగా ఉండాలి. శబ్దాలు ఎక్కువగా వినిపించని..
Updated on: Sep 23, 2024 | 6:03 PM

సాధారణంగా కొన్ని ఇంట్లో చోటు అడ్జెస్ట్ అవక పోవడం కారణంగా లేదా ఇతర కారణాల వల్ల పూజ చేసుకునే గది కిచెన్, బెడ్ రూమ్, హాల్‌లో వస్తాయి. మరి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గది ఎక్కడ ఉండటం వల్ల మంచి జరుగుతుంది? ఎక్కడ ఉంటే లాభం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇప్పుడు గదులు చాలా ఇరుగ్గా ఉండక పోవడంతో కిచెన్‌లోనే ఎక్కువగా దేవుడికి సపరేటుగా షెల్ఫ్ పెడుతున్నారు. సాధారణంగా దేవడి గది ఇతర గదులకు దూరంగా ఉండాలి. శబ్దాలు ఎక్కువగా వినిపించని ప్రదేశంలో ఉండాలి.

పూజ చేయడం వల్ల మనకు ఎంతో ప్రశాంతతత లభిస్తుంది. అలా ఉండాలంటే మీ పూజ గది కూడా అందంగా ఉండాలి. ఇంట్లో ప్రతి రోజూ పూజ చేస్తూ ఉండటం వల్ల.. ఇంట్లో పాజిటివ్ శక్తి నెలకొంటుంది.

సాధారణంగా పూజ గది ఇంటికి ఈశాన్య మూల, తూర్పు లేదా ఉత్తర మూల్లలో ఉండాలి. ఈ దిక్కులు పూజ చేసుకోవడానికి చాలా అనుకూలమైన ప్రదేశాలు. ఈ దిశలో ఉండే పూజ గదిలో పూజలు నిర్వహించడం వల్ల చాలా మంది.

వాస్తు శాస్త్రం ప్రకారం చెప్పాలంటే పూజ గది.. వంట గదిలో ఉండకూడదు. ఎందుకంటే వంట గది అగ్ని మూలకంతో ముడి పడి ఉంటుంది. ఇంట్లో సానుకూల శక్తి దెబ్బతింటుంది. కిచెన్‌లో వివిధ రకాల ఆహారాలు వండుతారు. కాబట్టి కిచెన్‌లో వంట గది లేకపోవడమే మంచిది. (NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)





























