Monkeypox: దుబాయ్ నుంచి వచ్చిన మరో కేరళ వాసికి మంకీపాక్స్ నిర్ధారణ.. క్లాడ్ 1బి వైరస్‌గా గుర్తింపు
భారతదేశంలో మంకీ ఫాక్స్ కేసు మరొకటి నమోదైంది. మూడో మంకీ ఫాక్స్ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన కేరళ వాసి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. విచారణ నివేదికలో బాధితుడికి మంకీపాక్స్‌కు చెందిన క్లాడ్ 1బి వైరస్ సోకినట్లు వెల్లడింది.
భారతదేశంలో మంకీపాక్స్ కేసు మరొకటి నమోదైంది. మూడో మంకీపాక్స్ కేసుకి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వచ్చాయి. రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన కేరళ వాసి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. విచారణ నివేదికలో బాధితుడికి మంకీపాక్స్‌కు చెందిన క్లాడ్ 1బి వైరస్ సోకినట్లు వెల్లడింది. ఇటీవల కేరళలోని మలప్పురంలో రెండవ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి కూడా యుఎఇ నుంచి భారతదేశానికి తిరిగి వచ్చాడు. ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని పరీక్షించగా.. మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు నివేదికలో వెల్లడైంది. విదేశీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య మంత్రి చెప్పారు.
ఢిల్లీలో మంకీపాక్స్ మొదటి కేసు
అంతకుముందు విదేశాలకు వెళ్లి భారతదేశానికి తిరిగి వచ్చిన డిల్లీకి చెందిన వ్యక్తికీ మంకీపాక్స్ వైరస్ సోకినట్లు వెల్లడింది. ఇలా మొదటి కేసు దేశ రాజధాని ఢిల్లీలో నమోదైంది. ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని ఢిల్లీలోని ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారు. ఐసోలేషన్ సమయంలో రోగి పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యులు రోగిని ఐసోలేట్ చేసి నిశితంగా పరిశీలిస్తున్నారు.
WHO హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది
ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు నిరంతరం పెరుగుతున్న దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని వారాల క్రితం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెండేళ్ల క్రితం కూడా మంకీపాక్స్ వైరస్ ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపించిందని WHO తెలిపింది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా లక్షకు పైగా కేసులు నమోదయ్యాయి.
ఈ వ్యాధిపై అప్రమత్తమైన ప్రభుత్వం
ఈ వ్యాధికి సంబంధించి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది. మంకీపాక్స్ వైరస్ విషయంలో పెద్దగా భయాందోళన చెందవద్దని ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది. ప్రజలకు తగిన సూచనలు చేసింది. అంతేకాదు మంకీపాక్స్ రోగులను గుర్తించడానికి ప్రభుత్వం విమానాశ్రయాలలో పరీక్షల సంఖ్య కూడా పెంచింది. దీనితో పాటు ఎవరికైనా ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.
మొదటి రోగి గురించి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏమి చెప్పింది?
ఈ రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 MPox వైరస్ గా గుర్తించారు. దీంతో WHO నివేదించిన వైరస్‌కి భారతదేశంలో వెలుగులోకి వచ్చిన మొదటి రోగికి సంబంధం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ చెబుతోంది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన మూడవ రోగికి గ్రేడ్ వన్ బి వైరస్ సోకిందని వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..