Viral Video: రీల్స్‌ పిచ్చితో వికృతచేష్టలు.. రద్దీ రోడ్డులో వృద్ధుడి ముఖంపై ఫోమ్‌! ఆ తర్వాత ఏం జరిగిందంటే..

సోషల్‌ మీడియాలో ఓవర్‌నైట్‌ ఫేమస్‌ అయిపోయేందుకు కొందరు యువత చేసే పిచ్చి చేష్టలు నానాటికీ మితిమీరి పోతున్నాయి. కొందరు రద్దీ ప్రదేశాల్లో ప్రమాదకర రీతిలో రీల్స్‌ చేస్తూ కంపరం పుట్టిస్తున్నారు. రీల్స్‌ సరదాతో వీరు చేసే పనులు.. వీళ్లతోపాటు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకుంది. దీంతో ఒళ్లు మండిన స్థానికులు..

Viral Video: రీల్స్‌ పిచ్చితో వికృతచేష్టలు.. రద్దీ రోడ్డులో వృద్ధుడి ముఖంపై ఫోమ్‌! ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Youth Spray Foam On Elderly Man
Follow us
Srilakshmi C

|

Updated on: Sep 23, 2024 | 5:27 PM

ఝాన్సీ, సెప్టెంబర్‌ 23: సోషల్‌ మీడియాలో ఓవర్‌నైట్‌ ఫేమస్‌ అయిపోయేందుకు కొందరు యువత చేసే పిచ్చి చేష్టలు నానాటికీ మితిమీరి పోతున్నాయి. కొందరు రద్దీ ప్రదేశాల్లో ప్రమాదకర రీతిలో రీల్స్‌ చేస్తూ కంపరం పుట్టిస్తున్నారు. రీల్స్‌ సరదాతో వీరు చేసే పనులు.. వీళ్లతోపాటు ఇతరులను కూడా ప్రమాదంలోకి నెడుతున్నాయి. తాజాగా అలాంటి ఓ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో చోటు చేసుకుంది. దీంతో ఒళ్లు మండిన స్థానికులు సదరు యవకులను దొరకబుచ్చుకుని చితక్కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకెళ్తే..

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో నిత్యం రద్దీగా ఉండే నవాబాద్‌ ప్రాంతంలోని రోడ్డుపై ఇద్దరు యువకులు వికృత చేష్టలకు పాల్పడ్డారు. అదే రోడ్డుపై సైకిల్‌ తొక్కుతూ వెళుతున్న ఓ వృద్ధుడి ముఖంపై వీరు తెల్లటి ఫోమ్‌ కొట్టి రెచ్చిపోయారు. అనంతరం అదే రోడ్డుపై బిగ్గరగా అరుచుకుంటూ ప్రమాదకర రీతిలో బైక్‌ నడిపిన సదరు యువకులు ఇతర వాహనదారులకు దడ పుట్టించారు. ఒక వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తూ ఉంటే.. మరో యువకుడు అదే బైక్‌పై వెనక కూర్చుని ఆ వృద్ధుడి ముఖంపై వైట్‌ ఫోమ్‌ను ముఖం నిండా స్ప్రే చేశాడు. దీంతో ఆ వృద్ధుడి ముఖం అంతా ఫోమ్‌ కప్పేయడంతో రోడ్డుపై సైకిల్‌ నిలిపి బిక్కమొహం వేసి చూడసాగాడు. మరికొంత దూరం వెళ్లాక మరో వ్యక్తి ముఖంపై కూడా ఇదే విధంగా స్ర్పే చేశారు. పైగా దీన్ని ఫోన్లో వీడియోలు తీస్తూ.. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ నెట్టింట వైరల్‌గా మారడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. యువకుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

రద్దీగా ఉండే రోడ్డులో ఇటువంటి నిర్లక్ష్య ప్రవర్తన ప్రమాదాలకు, మరణాలకు కూడా దారితీయవచ్చని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రీల్స్‌ మోజులో ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ మండి పడుతున్నారు. కాగా ఈ సంఘటనలో రోడ్డుపై హల్‌చల్ చేసిన యువకుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.