Road Accident: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారును ఢీకొట్టిన లారీ! నలుగురు స్పాట్ డెడ్
అనంతపురం జిల్లాలో ఈ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలోని నరసమ్మ గుడి వద్ద కారును ఓ లారీ ఢీకొట్టింది. ఇన్నోవా కారు ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అనంతపురంకు చెందిన నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నార్పలలోని ఓ బర్త్ డే ఫంక్షన్ కి వెళ్ళి, వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు..
అనంతపురం, సెప్టెంబర్ 22: అనంతపురం జిల్లాలో ఈ తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమదం చోటు చేసుకుంది. బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి గ్రామ సమీపంలోని నరసమ్మ గుడి వద్ద కారును ఓ లారీ ఢీకొట్టింది. ఇన్నోవా కారు ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో అనంతపురంకు చెందిన నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. నార్పలలోని ఓ బర్త్ డే ఫంక్షన్ కి వెళ్ళి, వస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుక్కరాయ సముద్రం రేకులకుంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులను అనంతపురం సిండికేట్ నగర్ వాసులుగా గుర్తించారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మితిమీరిన వేగం కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. శనివారం అర్ధరాత్రి నార్పల వైపు వెళ్తున్న కారును వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో అమూల్ నెయ్యి వాడారంటూ దుష్ప్రచారం.. ఏడుగురు అరెస్ట్
తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూల తయారీలో జంతువుల కొవ్వు వినియోగించారనే వార్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కలియుగ దైవంగా చెప్పుకునే తిరుమలేశుడి లడ్డు ప్రసాదంలో నాణ్యతలేని నెయ్యి ఉపయోగించారని గత జగన్ ప్రభుత్వంపై కూటమి సర్కార్ ఆరోపణలు రాజకీయంగానూ దుమారం లేపుతున్నాయి. ఈ క్రమంలో టీటీడీ లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నాణ్యత లేని నెయ్యి అమూల్ బ్రాండ్‌కు చెందినదంటూ ఓ ఫేక్ న్యూస్ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతుంది. ఇందుకు సంబంధించిన నకిలీ వార్తలను ఎక్స్‌లో పోస్టుచేసి, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు గానూ గుజరాత్‌లోని అహ్మదాబాద్ పోలీసులు ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.
ఆనంద్‌కు చెందిన గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ‘అమూల్’ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను విక్రయిస్తున్న విషయం తెలిసిందే. వీరు తితిదేకు నెయ్యి సరఫరా చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆ సంస్థ ఖండించడమేకాకుండ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన సైబర్ క్రైం పోలీసులు నకిలీ వార్తలను ప్రచారం చేస్తున్న ఆకతాయిలను అరెస్ట్ చేసింది.